@ నాగో నాగన్న నాగన్న నాగో @ naago naaganna naganna naago @ నాగరాజ భజన పాటల లిరిక్స్ @ Nagaraja Bhajana Patala lyrics in Telugu

॥ నాగో నాగన్న ॥
నాగో నాగన్న నాగన్న నాగో
పడి మీద ఆడింది నాగన్న
పడగవిప్పి పడి మీద ఆడితే పందల రాజే మురియంగా
|| ౨ ||
పరమ శివుని ఆ మెడలో చూడు పగడాల దండ నాగన్న
సుబ్రహ్మణ్యుని పాదస్పర్శతో పునీతుడాయేను నాగన్న
ధరణి తల్లిని తలపై మోసిన దయగలవాడే నాగన్న
(నాగో) || ౨ ||
నాగులచవితికి పాల వరదలో మునిగి తేలుతాడు నాగన్న
పాలు పోసిన ముత్తైదువులకు నిండు మాంగల్యబలమన్న
సర్వ దోషాలకు ఒకటే మార్గం పుట్ట ప్రదర్శన గదరన్న
(నాగో) || ౨ ||
పద్మనాభుడికి మెత్తని శయనం నాగన్న విపే గదరన్న
ఎల్లమ్మ తల్లి నడుమొడ్డానం నల్ల నాగులు చూడన్నా
రాహుకేతువుల జంట స్వరూపం జడల మరి ఆ నాగన్న
(నాగో) || ౨ ||
అష్టలక్ష్ములు అమృత ధారలు మదించగొచ్చెను నీ పుణ్యం
శబరి కొండపై నాగదోషమే తొలగించకుందు నాగన్న
అడుగడుగునా మాకండ వుండి మణికంఠుని దర్శనం ఈయన్న
(నాగో) || ౨ ||
స్వామియే శరణం అయ్యప్ప 🙏
```

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow