కదిలే శివలింగం- ఎంత తవ్వినా దొరకని మూలస్థానం- ఎక్కడుందో తెలుసా?

రుద్రపూర్ దుగ్ధేశ్వరనాథ శివాలయం

ఉత్తరప్రదేశ్‌లో వెలసిన రుద్రపూర్ దుగ్ధేశ్వరనాథుడు – ఈ ఆలయ విశిష్టత ఏమిటి?

Moving Shiva Lingam in Uttar Pradesh: బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయ కారకులు. త్రిమూర్తులలో పరమేశ్వరుడు లయ కారకుడని తెలిసిందే. ఆధ్యాత్మికతకు నెలవైన మన దేశంలో శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయే అద్భుత ఆలయాలు! ప్రపంచంలోనే ప్రత్యేకమైన కదిలే శివలింగం!

నమ్మలేని నిజం

```

మన దేశం ఆధ్యాత్మికతకు నెలవు. ఇక్కడ ఎన్నో పుణ్య క్షేత్రాలు కొలువై ఉన్నాయి. అందులో ఎక్కువగా కనిపించే దేవాలయాలు శివుడివి. ఎందుకంటే మనకు పురాణాల ప్రకారం శివుడు మొదటి దేవుడు. ఇక హిందువుల ఆరాధ్య దైవం కూడా శివుడు కావడం విశేషం.

'శివమ్' అంటే శుభం అని, లింగం అంటే సంకేతం అని అర్ధం. శివలింగం అంటే శుభానికి సంకేతం అని అర్ధం. ఈ ప్రపంచంలో ఎన్నో శివలింగాలు ఉన్నాయి. అందులో కొన్ని మనుషులు ప్రతిష్టించినవి అయితే, మరి కొన్ని వాటంతట అవే స్వయంభువుగా వెలిసినవి.

వీటిల్లో ఒక శివలింగం మాత్రం చాలా ప్రత్యేకమైనది! ఈ శివలింగం ప్రత్యేకత ఏమిటో తెలుసా! ఈ శివలింగం కదులుతుంది! ఇలాంటి విషయం ఇంతకు ముందు ఎప్పుడూ వినకపోయినా, చూడకపోయినా నమ్మి తీరాల్సిందే! ఎందుకంటే ఇది నిజం.

```

కదిలే శివలింగం ఎక్కడుందో తెలుసా!

```

శివలింగం ఏంటి కదలటం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది వాస్తవం! ఇక్కడి కోవెలలో శివలింగం ఒక్కసారి కదలడం ప్రారంభిస్తే ఏకధాటిగా 24 గంటలు కదులుతుంది. ఒకసారి ఆగితే ఇక ఎంత కదిపినా కదలదు.

ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉత్తరప్రదేశ్‌లోని దియోరియా జిల్లాలో ఉంది. ఇక్కడి శివుడిని దుగ్ధేశ్వరనాథుడని అంటారు. ఆలయ స్థల పురాణం ప్రకారం మధ్యప్రదేశ్‌లో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి ఇది ఉపలింగం అని అంటారు.

ఈ అద్భుతమైన ఆలయం గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

```

రుజువైన నిజం

```

మన దేశంలోని ఆలయాలు చేధించలేని మిస్టరీలకు నిలయమని మరోసారి రుజువు చేస్తుంది దియోరియాలోని రుద్రపురంలో ఉన్న ఈ శివాలయం.

ఇక్కడి శివాలయంలోని శివలింగం పానవట్టం మీద కాకుండా సరాసరి భూమి మీదనే ప్రతిష్టించబడి ఉండడం విశేషం. రెండువేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం ఒక అద్భుతానికి ఆలవాలం.

ఈ ఆలయంలో శివలింగం అనూహ్యంగా అనేక సార్లు కదులుతుంది. అలా ఒక్కోసారి ఒక గంట సేపు కదలచ్చు, లేదా ఐదు గంటలు కదలచ్చు. ఒక్కోసారి రోజంతా నిర్విరామంగా ఇరవై నాలుగు గంటల సేపు కూడా కదులుతూనే ఉంటుందని స్థానికులు, అర్చకులు చెబుతారు.

అలాంటి సమయంలో స్వామివారిని చూడటానికి భక్తులు తండోపతండాలుగా కదిలి వస్తుంటారట. ఇలా కదిలిన శివలింగంలోని కదలిక ఒకసారి ఆగిపోయాక ఎవరు ఎంత కదిపినా ఒక్క అంగుళం కూడా కదలదట. ఇదే ఇక్కడి వింత.

```

ఎంత తవ్వినా జాడ తెలియని వైనం

```

ఈ లింగం భూమి లోపలకి ఎంత లోతు వరకు ఉందో తెలుసుకోవటానికి ఎంత త్రవ్వినా ఆ జాడ కూడా తెలుసుకోవడంలో విఫలమయ్యారట. ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు సైతం ఈ వింతను చూసి ఆశ్చర్యపోయారట!

```

శివలీల అంటే ఇదే!

```

రెండువేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో శివలింగం ఎన్నో సందర్భాలలో కదలడం చాలా ప్రత్యేకత! ఈ సంఘటనను చూడటానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు.

ఈ చిత్రమైన సంఘటనను ఎలాగైనా కనిపెట్టాలని శాస్త్రవేత్తలు శివలింగం చుట్టూ ఎంత తవ్వినా దాని జాడ తెలియడం లేదట! దానితో ఇక్కడ సాక్షాత్తు పరమ శివుడే వెలిశాడని భక్తుల నమ్మకం.

చూసే అదృష్టం ఉండాలేగాని ఇలాంటి అబ్బురపరిచే దేవాలయాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించాలని అనిపిస్తోంది కదా!

మనం కూడా తప్పకుండా ఈ శివాలయాన్ని దర్శించి ఈ మహిమను కనులారా వీక్షిద్దాం.

```
ఓం నమః శివాయ!
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow