పంచగిరుల పావనమూర్తికి / Pancha girula pavanamurthiki - abhishekam - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

🕉️ పంచ గిరుల పావనమూర్తికి 🕉️

─── అభిషేక గీతం ───
పంచ గిరుల పావనమూర్తికి పరిపరి దండాలు
భక్తుల పరవశ గానాలు
అన్నదాన ప్రభు సన్నిధిలోన అభిషేక పూజాలు
॥ ౧. పాలాభిషేకం ॥
పాలవెల్లిలా వెలిగే స్వామికి పాలాభిషేకమ్ము
పార్థ సారథిగారాల తండ్రికి పాలాభిషేకమ్ము
స్వామికి పాలాభిషేకమ్ము
ఆవు పాలను తెచ్చామయ్య పాలాభిషేకమ్ము
అయ్యప్ప... ఓ.... అయ్యప్ప
అయ్యప్ప... ఓ... అయ్యప్ప
॥ ౨. దధ్యాభిషేకం ॥
దగ దగ మెరిసే తేజోమూర్తి దధ్యాభిషేకమ్
స్వామికి దధ్యాభిషేకమ్
ఆవు పెరుగు తెచ్చామయ్య దధ్యాభిషేకమ్
అయ్యప్ప... ఓ.... అయ్యప్ప
అయ్యప్ప... ఓ... అయ్యప్ప
॥ ౩. నెయ్యాభిషేకం ॥
అయ్యనయ్య అయ్యప్ప స్వామికి నెయ్యాభిషేకమ్ము
స్వామికి నెయ్యాభిషేకమ్ము
ఆవు నెయ్యి తెచ్చామయ్య నెయ్యాభిషేకమ్ము
అయ్యప్ప... ఓ.... అయ్యప్ప
అయ్యప్ప... ఓ... అయ్యప్ప
॥ ౪. తేనాభిషేకం ॥
పులివాహన అయ్యప్ప స్వామికి తేనాభిషేకమ్ము
స్వామికి తేనాభిషేకమ్ము
పుట్ట తేనెను తెచ్చామయ్య తేనాభిషేకమ్ము
అయ్యప్ప... ఓ.... అయ్యప్ప
అయ్యప్ప... ఓ... అయ్యప్ప
॥ ౫. చక్కెరాభిషేకం ॥
తీపి మాటల చిన్నారి స్వామికి చక్కెరాభిషేకం
స్వామికి చక్కెరాభిషేకం
పంచదార తెచ్చామయ్య చక్కెరాభిషేకం
అయ్యప్ప... ఓ.... అయ్యప్ప
అయ్యప్ప... ఓ... అయ్యప్ప
॥ ౬. పండాభిషేకం ॥
ముసి ముసి నవ్వుల అయ్యప్ప స్వామికి పండాభిషేకం
స్వామికి పండాభిషేకం
అండపిండ బ్రహ్మాండ స్వామికి అమృత అభిషేకం
పంచామృత అభిషేకం
రంభ ఫలములు తెచ్చామయ్య పండాభిషేకమ్ము
అయ్యప్ప... ఓ.... అయ్యప్ప
అయ్యప్ప... ఓ... అయ్యప్ప
॥ ౭. ఫలోదక స్నానం ॥
విల్లాలి వీరుడు వీరమణికంఠునికి ఫలోదక స్నానం
స్వామికి ఫలోదక స్నానం
నారికేళం తెచ్చామయ్య ఫలోదక స్నానం
అయ్యప్ప... ఓ.... అయ్యప్ప
అయ్యప్ప... ఓ... అయ్యప్ప
॥ ౮. భస్మాభిషేకం ॥
భూతనాద అయ్యప్ప స్వామికి భస్మాభిషేకమ్ము
స్వామికి భస్మాభిషేకమ్ము
విభూతిని తెచ్చామయ్య భస్మాభిషేకమ్ము
అయ్యప్ప... ఓ.... అయ్యప్ప
అయ్యప్ప... ఓ... అయ్యప్ప
॥ ౯. చందనాభిషేకం ॥
చందమామలా వెలిగే స్వామికి చందన అభిషేకం
స్వామికి చందన అభిషేకం
మంచి గంధం తెచ్చామయ్య గంధాభిషేకం
అయ్యప్ప... ఓ.... అయ్యప్ప
అయ్యప్ప... ఓ... అయ్యప్ప
॥ ౧౦. కుంకుమాభిషేకం ॥
హరి హర సుతుడైన అయ్యప్ప స్వామికి కుంకుమ అభిషేకం
స్వామికి కుంకుమ అభిషేకం
ఎర్రచందనం తెచ్చినామయ్య కుంకుమ అభిషేకం
అయ్యప్ప... ఓ.... అయ్యప్ప
అయ్యప్ప... ఓ... అయ్యప్ప
॥ ౧౧. పన్నీరాభిషేకం ॥
పేరు స్వాముల తేజో మూర్తికి పన్నీరాభిషేకం
స్వామికి పన్నీరాభిషేకం
మంచి నీరు తెచ్చామయ్య పన్నీరాభిషేకం
అయ్యప్ప... ఓ.... అయ్యప్ప
అయ్యప్ప... ఓ... అయ్యప్ప
॥ ౧౨. శుద్ధోదక స్నానం ॥
జంగమయ్య ముద్దుల తండ్రికి జలాభిషేకం
స్వామికి జలాభిషేకం
పంప నీరు తెచ్చామయ్య శుద్ధోదక స్నానం
అయ్యప్ప... ఓ.... అయ్యప్ప
అయ్యప్ప... ఓ... అయ్యప్ప
॥ ౧౩. పుష్పాభిషేకం ॥
పువ్వు లాగా నవ్వే స్వామికి పుష్పాభిషేకమ్ము
స్వామికి పుష్పాభిషేకమ్ము
మల్లె పూలు తెచ్చామయ్య పుష్పాభిషేకమ్ము
అయ్యప్ప... ఓ.... అయ్యప్ప
అయ్యప్ప... ఓ... అయ్యప్ప
॥ ౧౪. మంగళ హారతి ॥
యోగ మూర్తి అయ్యప్ప స్వామికి సకల అభిషేకాలు
జ్యోతిస్వరూపు అయ్యప్ప స్వామికి హారతులు ఇవ్వండి
మంగళహారతి నివ్వండి
కర్పూరం తెచ్చామయ్య మంగళ హారతి అందుకో
🕉️ నియమ నిష్టల దీక్షను పోనీ శబరికి పోదాము 🕉️
స్వామి పోదాము
పూర్వ జన్మల పుణ్యము నా ఆ స్వామిని చూద్దాము

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow