నల్లని మేఘం చినుకుగ / Nallani Megham - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

🕉️ నల్లని మేఘం చినుకుగ మారి 🕉️

─── అయ్యప్ప అభిషేక గీతం ───
॥ పల్లవి ॥
నల్లని మేఘం చినుకుగ మారి పంబా నదిలో నీరుగ మారి
అభిషేకం చేస్తానంది అయ్యప్పా
నీకు కలశాభిషేకమంది అయ్యప్పా
శరణం శరణం స్వామి - శరణం శరణం అయ్యప్ప (2)
॥ చరణం ౧ - పుష్పాంజలి ॥
పుంగవనమే పువ్వుగ మారి చల్లని నీ చిరునవ్వుగ మారి
పుష్పాంజలి చేస్తానంది అయ్యప్పా
నీకు పుష్పాభిషేకమంది అయ్యప్పా
శరణం శరణం స్వామి - శరణం శరణం అయ్యప్ప (2)
॥ చరణం ౨ - వింజామర ॥
మలయ మారుతం శబరికి చేరి చల్లని నీ గుడి సన్నిధి చేరి
వింజామర వీస్తానంది అయ్యప్పా
నీకు వింజామర వీస్తానంది అయ్యప్పా
శరణం శరణం స్వామి - శరణం శరణం అయ్యప్ప (2)
॥ చరణం ౩ - నాట్యం ॥
నెమలియే నీకై పురులే విప్పి పంబాసుందర తీరం చేరి
నాట్యాలు చేస్తానంది అయ్యప్పా
నీకై నాట్యాలు చేస్తానంది అయ్యప్పా
శరణం శరణం స్వామి - శరణం శరణం అయ్యప్ప (2)
॥ చరణం ౪ - పది పూజలు ॥
వేదమంత్రమే తండ్రిగ మారి విశ్వవిధాత విరించిగ మారి
పడి పూజలు చేయగ వచ్చారయ్యప్పా
నీకు పడి పూజలు చేయగ వచ్చారయ్యప్పా
శరణం శరణం స్వామి - శరణం శరణం అయ్యప్ప (2)
🕉️ శరణం శరణం స్వామి - శరణం శరణం అయ్యప్ప 🕉️

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow