మహాలయ పితృపక్షం అమావాస్య - ఎందుకంత ప్రత్యేకం?
మహాభారత యుద్ధంలో చనిపోయిన వారందరికీ కృష్ణ భగవానుడు తిలోదకాలు ఇప్పించేందుకు సిద్ధమై బ్రాహ్మణులను పిలిచి పేర్లు చదివించారు. కర్ణుడి పేరు వచ్చే సరికి ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడం కుంతీదేవికి కన్నీరు తెప్పించింది.
ఇటు పాండవులు, అటు కౌరవులు తమ వారి పేర్లు వచ్చినపుడు వారికి తిలోదకాలు వదిలారు. కానీ, కర్ణుడి విషయంలో ధర్మరాజు తల్లితో, "ఇంటికి పెద్దవాడిని పడగొట్టి, సింహాసనం నాకు ఇప్పించావు. మీ వద్ద రహస్యం దాగడం వల్ల ఇంత ఉపద్రవం జరిగింది" అని అన్నాడట.
ఇదిలా ఉండగా స్వర్గానికి వెళ్లిన కర్ణుడికి అక్కడ బంగారం, వెండి, ముత్యాలు, వజ్రాలు తప్ప తినడానికి, తాగడానికి అన్నపానీయాలు కనిపించలేదు. యమధర్మరాజును ప్రార్థించగా, "నీ జీవిత కాలంలో నువ్వు ఏమేం దానం చేశావో అవే ఉన్నాయి" అని చెప్పాడట. దీంతో కర్ణుడు కిందకు వెళ్లి ఉపకారాలు చేసి వస్తానని కోరగా, యమధర్మరాజు అనుగ్రహించాడు. భాద్రపద మాసం కృష్ణపక్ష పాడ్యమి నుంచి అమావాస్య వరకూ 15 రోజుల పాటు చలివేంద్రాలు, అన్నశాలలు పెట్టి ఉపకారాలు చేశాడు.
📖 ఇది కూడా చదవండి 'కాలసర్ప దోషాలు' ఎన్ని రకాలు? - వివాహపరమైన సమస్యలకు కారణం ఏంటి?అందరికీ అవకాశం
తనకు ఎదురైన పరిస్థితి నేపథ్యంలో, "ఇలా ఉపకారాలు చేయకుండా వెళ్లిపోయిన నాలాంటి వారెందరో ఉంటారు, వారికి కూడా మరో అవకాశం ఇవ్వండి. ఈ 15 రోజుల్లో వాళ్ల పేరు చెప్పి కొడుకులు, మనవళ్లు దానం చేస్తే, అందుకు తగిన ప్రతిఫలం వారి పితృదేవతల ఖాతాలో పడేట్లు అనుగ్రహించండి" అని కర్ణుడు కోరడంతో యమధర్మరాజు 'తథాస్తు' అన్నారట.
శ్రాద్ధ తిథి వివరాలు
- సెప్టెం 27 భాను - ప్రతిపద (పక్షారంభం)
- సెప్టెం 28 సోమ - ద్వితీయ
- సెప్టెం 29 మంగళ - తృతీయ (మహాభరణి)
- సెప్టెం 30 బుధ - చతుర్థి
- అక్టో 1 బృహస్పతి - పంచమి
- అక్టో 2 శుక్ర - షష్ఠి, సప్తమి
- అక్టో 3 శని - అష్టమి (మధ్యాష్టమి)
- అక్టో 4 భాను - నవమి (అవిధవా నవమి)
- అక్టో 5 సోమ - దశమి
- అక్టో 6 మంగళ - సర్వేషాం ఏకాదశి
- అక్టో 7 బుధ - ద్వాదశి (యతి ద్వాదశి)
- అక్టో 8 బృహస్పతి - త్రయోదశి
- అక్టో 9 శుక్ర - చతుర్దశి (ఘాత చతుర్దశి)
- అక్టో 10 శని - అమావాస్య (సర్వపితృ అమావాస్య)