అయ్యప్ప ఋణం / Ayyappa Runam - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

🌺 అయ్యప్ప ఋణం 🌺


అయ్యప్పా... అయ్యప్పా... అయ్యప్పా... అయ్యప్పా...

ఏమిచ్చి నీ ఋణము తీర్చుకుందురా
నేనేమిచ్చి నీ ఋణము తీర్చుకుందురా
చల్లని అయ్యప్పా మా స్వామి చక్కని అయ్యప్పా
బంగారు కొండలో వెలిసిన మా దేవుడు నీవయ్యా
మా రాజువు నీవయ్యా
॥ అయ్యప్ప ॥

మాకై పుట్టిన దేవుడా మళ్లీ పుట్టిన శ్రీరాముడా
రాజ్యమేలమని తండ్రి చెప్పినా వనవాసమెల్లావురా
మాకై కొండల్లో నిలచావురా
॥ అయ్యప్ప ॥

కొండల్లో ఏమున్నదయ్యా మా గుండెలో చూడరాదయ్యా
గుండె గుండెకో గుడిని కట్టి పూజలు చేసేమురా
పూల సేవలు చేసేమురా
॥ అయ్యప్ప ॥

పారేటి సెలయేరు గంగను తెచ్చి
పంచనాగుల ఆవుపాలను తెచ్చి
అభిషేక పూజలు నీకు చేసినా ఋణము తీరునా
నా ఋణము తీరునా
॥ అయ్యప్పా ॥


॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow