నిన్ను చూడక నేనుండగలనా – అయ్యప్ప భక్తి గీతం
నిన్ను చూడక నేనుండగలనా
నీ కొండకు రాకుండ గలనా
ఈ దేహం నీదు ప్రసాదం
నా ప్రాణం నీ ఉపకారం
నా ప్రాణం నీ ఉపకారం
మనసున్నది నీ ధ్యాన లోనే
తనువున్నది నీ సేవ లోనే
ప్రతి నోట నీ చరణ నామం
నా నోటే నీ మధుర గానం
నా నోటే నీ మధుర గానం
ఆ బ్రహ్మకు నీ రుణపడనా
రాత రాశాడు నిను చూడగా
కనిపించే దైవాలు తల్లిదండ్రులై
జన్మనిచ్చారు ఏనాటి ఫలమో
జన్మనిచ్చారు ఏనాటి ఫలమో
ఈ ఇహమందు ఏ కొత్త కోరికలు
ఇక రాకుండా నువ్వు చూడవా
ఈ జన్మంతా నిన్ను కొలిచి సేవింతునయ్యా
ఇక మరుజన్మ నాకివ్వకయ్య
ఇక మరుజన్మ నాకివ్వకయ్య