Naga Sadhus: మహా కుంభమేళాలో నాగ సాధువులు.. వారి గురించి ఈ ఆశ్చర్యకర విషయాలు తెలుసా?

 

ప్రస్తుతం ప్రయోగరాజ్‌లో జరుగుతు


న్న కుంభమేళాలో తొలి రోజు పవిత్ర స్నానం ఆచరించిన నాగ సాధువులు సాధారణ భక్తులను మంత్రముగ్ధులను చేశారు. నాగసాధువులు స్నానం చేయడం వల్ల పుణ్య జలాలకు మరింత పవిత్రత వస్తుందని అందరూ భావిస్తారు. అందుకే కుంభమేళా సమయంలో తొలి స్నానాన్ని నాగసాధువులకు కేటాయిస్తారు.

తల నుంచి కాలి వరకు బూడిద.. త్రిశూలాలు, కత్తులు, ఢమరకం ధరించి విచిత్ర ఆహార్యం.. వాళ్లకు బంధాలు, అనుభంధాలు ఉండవు. సర్వం పరిత్యజించిన సన్యాసులు. చలి కాలమైనా, వేసవి కాలమైనా దిగంబరులుగానే ఉంటారు. జనావాసాలకు దూరంగా సాధనే ప్రపంచంగా గడుపుతారు. కుంభమేళా సమయంలో మాత్రమే జన సామాన్యంతో కలుస్తారు. ప్రస్తుతం ప్రయోగరాజ్‌ (Prayagraj)లో జరుగుతున్న కుంభమేళా (MahaKumbh)లో తొలి రోజు పవిత్ర స్నానం ఆచరించిన నాగ సాధువులు (Naga Sadhus) సాధారణ భక్తులను మంత్రముగ్ధులను చేశారు. నాగసాధువులు స్నానం చేయడం వల్ల పుణ్య జలాలకు మరింత పవిత్రత వస్తుందని అందరూ భావిస్తారు. అందుకే కుంభమేళా సమయంలో తొలి స్నానాన్ని నాగసాధువులకు కేటాయిస్తారు. బూడిద, భస్మం, గంధం మొదలైన అలంకరణలతో వచ్చే నాగసాధువులు పవిత్ర స్నానం తర్వాత తిరిగి జనసామాన్యులకు దూరం అయిపోతారు. ప్రపంచంలోనే అతి పెద్ద మత సమ్మేళనం అయిన కుంభమేళా ప్రారంభం కాగానే, నాగ సాధువుల గురించి చర్చ మళ్లీ మరోసారి తెర పైకి వచ్చింది. దేవాలయాలలో పూజారులు లేదా మఠాలలో నివసించే సన్యాసుల వలే కాకుండా, నాగ సాధువులు పవిత్ర స్నానం తర్వాత మళ్లీ కనిపించరు. నాగ సాధువులు మత రక్షకులు. వీరు సమాజంలో మతాన్ని ప్రచారం చేస్తారు. 8వ శతాబ్దంలో ఆదిగురు శంకరాచార్యులు ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు. ఈ సాధువులు అఖారాలలో నివసించడం ద్వారా క్రమశిక్షణతో, వ్యవస్థీకృత జీవితాన్ని గడుపుతారు. కుంభ మేళాలో పవిత్ర స్నానం తర్వాత తిరిగి వారి ఆవాసాలైన గుహలు, అడవులు, హిమాలయాలకు తిరిగి వెళ్లిపోతారు. నగరాల్లోని కొన్ని దేవాలయాలు లేదా అఖారాలలో వారు చాలా అరుదుగా కనిపిస్తారు. నాగ సాధువులు తిరిగి తమ ఆవాసాలకు వెళ్లిపోయిన తర్వాత యోగా, ధ్యానం, గ్రంథాల అధ్యయనంలో మునగిపోతారు. భౌతిక ఆస్తులు, సామాజిక నిబంధనలకు దూరంగా ఉంటారు. నాగ సాధువు కావాలంటే 12 సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేయాలి. వీరు శివుని ఆరాధకులు.

Previous Post Next Post

نموذج الاتصال