అయ్యా నియమాల మాలతో నిన్ను కొలిచినా నిజము తెలిసేనయ్యా ayyapa niyamala malatho

అయ్యా నియమాల మాలతో నిన్ను కొలిచినా నిజము తెలిసేనయ్యా

మలినమైన నా మనసు నందు యతి మధురులోలికెనయ్యా
దివ్యజ్యోతి అను పేరులోన ఇక చీకటుండదయ్య
రంగనాథుడే వెలిసిన గ్రామం నిత్య వెలుగులయ్యా


శరణు ఘోషలే పాడుకుంటిని,
క్షణము క్షణము నిన్ను మరువకుంటిని,
గుండె నిండుగా నీదు రూపమే నింపుకుంటినాయ్య "అయ్యా"


మా ఊరినున్న మా భాగ్యలక్ష్మికి బాధ చెప్పుకున్నా,
పోచమ్మకు బోనము చేసి మొక్కు మొక్కుకున్నా


అభయమిచ్చు ఆ ఆంజనేయునితో నేను వేడుకున్నా,
మొక్కులన్ని ఇరుముడిని కట్టి నీ కొండ చేరుకున్న


కరుణించి దారి చూపిస్తావో
కానాల్లో మమ్ము నడిపిస్తావో (2)
"కరుణామయ కారణవాస కనికరించవయ్యా" అయ్యా


కటిక నేలపై తుంగ చాపపై నిద్రపోతినయ్య
కనులు మూసినా కలల నిండా నీ దివ్య రూపమయ్యా


పడి పూజల నిండు రూపమే మనసు నిండేనాయ్యా
పంచ గిరులనే వదిలి వచ్చి మా పక్కనుందువయ్యా


కన్య స్వామి రూపములోనూ
కత్తి స్వామి రూపములోనూ
గురుస్వామి రూపములోనూ మా ముందు నిలుతువయ్యా


కాలినడకతో కొండాకొనాలో నడిచి వచ్చు వేళ
ప్రతి చెట్టు పుట్టలో నీదు నామము ప్రతిష్టించేనాయ్య


పసిపాప రూపమున పడి మెట్లపై నిన్ను చూచువేళ
నా తనువులోని ఆణువణువునందు నీ రూపు నిండేనాయ్యా


ఏ జన్మలోని ఋణముందో
ఈ జన్మలోన అది తీరిందో
ప్రతి జన్మలోన నిను కొలిచే భాగ్యం కనికరించవయ్యా "అయ్యా"

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow