నా చిన్ని చేతులు చప్పట్లు కొడితినే
నా చిన్ని గొంతులో కీర్తనలు చేస్తినే
నా చిన్ని మనసులో నీ స్మరణ చేస్తినే
తెలిసి తెలియని తనము నిన్ను తెలుసుకుంటినే
బాల స్వామిని బంగారు అయ్యప్పా
కన్నెస్వామిని కరుణించు అయ్యప్పా
|| స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం || (2)
నా ఆటలో నీవే నా స్వామి అయ్యప్ప
నా పాటలో నీవే నా స్వామి అయ్యప్ప
నా మాటలో నీవే స్వామి శరణం అయ్యప్ప
నా చేతలో నీవే స్వామి శరణం అయ్యప్ప
|| బాల స్వామిని || స్వామియే శరణం ||
నాలో నువ్వే ఉన్నావు అయ్యప్ప
నీలో నేనై ఉంటాను అయ్యప్పా
నన్ను నడిపించేది నువ్వే స్వామి అయ్యప్ప
నన్ను నీ దరిచేర్చే దైవము అయ్యప్పా
|| బాల స్వామిని || స్వామి దింతక ||
ఈ చిన్ని తనములో నీ మాల వేసినా
నాకెంత భాగ్యమో ఏ జన్మ పుణ్యమో
ఇరుముడి కట్టి శబరిమలైకి నెయ్యాభిషేకం చేస్తాను అయ్యప్పా
|| బాల స్వామిని || స్వామియే శరణం || స్వామి దింతక || (3)
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్పా