పుట్టెడు దుఃఖం / Puttedu dukkam - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

🌺 పుట్టెడు దుఃఖం ఉన్నా గాని 🌺


పుట్టెడు దుఃఖం ఉన్నా గాని అయ్యా అయ్యప్పో
నా స్వామి అయ్యప్ప
నీ పూజ నేను మరువనయ్యా అయ్యా అయ్యప్ప
నా స్వామి అయ్యప్ప
॥ 2 ॥

తండ్రివని నిన్ను అనుకున్నా
తనయుడని నన్ను అనుకోరా
॥ 2 ॥
దాగలేవు కష్టాలన్నీ అయ్యా అయ్యప్ప
॥ 2 ॥
నీ ఒడిలో నన్ను ఒదార్చయ్యా స్వామి అయ్యప్ప

కష్టాలన్నీ ఒక్కసారిగా కట్టగట్టుకొచ్చినా గాని
॥ 2 ॥
కళ్లారా నిన్నే చూడ అయ్యా అయ్యప్పా
॥ 2 ॥
నీ కొండ నడిచి వస్తానయ్యా అయ్యా అయ్యప్పా

కురిసేటి జల్లుల వోలే కారేటి కన్నీటితో
॥ 2 ॥
కాళ్లు నీవి కడిగి వస్తా అయ్యా అయ్యప్పా
॥ 2 ॥
నీ కడుపులో నన్ను దాచుకోరా స్వామి అయ్యప్ప

"కష్టం ఉంది పోకురా బిడ్డా" అంటూ అమ్మ అంటున్నా
"దారిలోనా భద్రం కొడకా" అంటూ అయ్య చెబుతున్నా
॥ 2 ॥

ఎందరు వద్దన్నా గాని అయ్యా నేను వస్తున్నా
॥ 2 ॥
వట్టి చేతులతో నన్ను పంపకురా నా అయ్యప్ప


॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow