Phalanimalai vasuda... l ఫలనిమలై వాసుడా... భజన పాటల లిరిక్స్ l

ఫలనిమలై వాసుడా - అయ్యప్ప భక్తి గీతం

ఫలనిమలై వాసుడా

శబరిమల అయ్యప్ప స్వామి భక్తి గీతం

ఫలనిమలై వాసుడా ఫలనిమలై వాసుడా

శబరి అయ్యప్ప స్వామి సోదరా...

శబరి అయ్యప్ప స్వామి సోదరా...

❦ ❦ ❦

నిలువెత్తు కొండపైన నిచ్చెన మెట్లను ఎక్కి

నిన్ను చూడ వచ్చాము నీలకంఠ తనయా.....

వేలనికి...... హరోం హర

మురుగన్ కి..... హరోం హర

హరోం హర హరోం హర హరోం హరా....

❦ ❦ ❦

కష్టమైన నష్టమైన కాలినడక మెట్లెక్కి

కలియుగ కష్టాలన్నీ కడతేర్చు అంటాము....

వేలనికి...... హరోం హర

మురుగన్ కి..... హరోం హర

హరోం హర హరోం హర హరోం హరా....

❦ ❦ ❦

ఫలనిమలై కొండమీద పార్వతమ్మ కొడక నీకు

పూనకాల భక్తులతో పానకాలు తెచ్చాము.....

వేలనికి...... హరోం హర

మురుగన్ కి..... హరోం హర

హరోం హర హరోం హర హరోం హరా....

❦ ❦ ❦

ఫలనిమలై వాసుడా ఫలనిమలై వాసుడా

శబరి అయ్యప్ప స్వామి సోదరా...

శబరి అయ్యప్ప స్వామి సోదరా...

🙏 స్వామియే శరణం అయ్యప్ప 🙏

హరిహర సూత్రునికి శరణు

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow