నల్లానల్లాని
బాలుడు గోపాలుడు గోవిందుడే
గురువాయురు శ్రీకృష్ణ భక్తి గీతం
నల్లానల్లాని బాలుడు గోపాలుడు గోవిందుడే
గురువాయురు దేవుడు అందరికీ ఆరాద్యుడే ॥2॥
✦ ✦ ✦ ✦ ✦
ఆపదలాపే వాడయా | ఆ ఆపద్భాంధవుడేనయా ॥
గురువాయురు కోవెలలో | కొలువైయున్న వాడయా ॥
నల్లానల్లాని ॥2॥
✦ ✦ ✦ ✦ ✦
చందన గంధపు చాయలా | మెరిసె దైవం తానయా ॥
అందరి కన్నుల పండగై | శ్రీకృష్ణుడు ఇలా వెలిసాడయా ॥
నల్లా నల్లాని ॥2॥
✦ ✦ ✦ ✦ ✦
దేవకి నోములు పండగ | నందుని ఇంట పండుగ ॥
దేవతలందరి దేవుడై ॥2॥
గురువాయురున నిలిచాడయా
నల్లా నల్లాని ॥2॥
✦ ✦ ✦ ✦ ✦
రేపల్లెకు తను బాలుడై | ఆ పల్లెల గోపాలుడై ॥
యమునా విహారి దైవమై ॥2॥
గురువాయురున నిలిచాడయా
నల్లా నల్లాని ॥2॥
✦ ✦ ✦ ✦ ✦
బృందావని సంచారుడై | రాధా మానస చోరుడై ॥
వేణువునూదే నాదుడై ॥2॥
గురువాయురున నిలిచాడయా
నల్లా నల్లాని ॥2॥