|సాంగ్ లిరిక్స్, మంగ్లీ (Mangli) అమ్మవారి భజన పాటల లిరిక్స్ జగజ్జనని (Jagajjanani) నల్లటి రూపంలో మాంకాళి

అమ్మవారి స్తుతి - Devi Stuti

🌺 అమ్మవారి స్తుతి 🌺

Devi Mahatmyam - Divine Mother's Glory

️

నల్లటి రూపంలో మాంకాళి

ఎర్రటి కన్నుల కాళివే

సల్లని చూపుల మాతవే

త్రిమూర్తులైన నీ బిడ్డలమ్మ

ముల్లోకాలకు తల్లివే, మమ్ము కాపాడేవే

దుష్టుల చెండాడే దుర్గమ్మ

శరణు కోరితే అమ్మవే

వరములిచ్చే రాణివే

దిక్కు నీవంటూ వేడేము అమ్మ

దండి దేవివి నీవే… దయను జూపించే

మెడలో కంకలాలలా మాలలు ఉన్న

శంకరీ దేవి నీవేనమ్మా

శూలం ఎత్తినవమ్మా శుంకల దేవి

భూగోళం నీ చేతిలో బొమ్మ

బ్రహ్మాండంలోన భ్రమరాంబిక

సృష్టికే అందానివే… సృష్టి నీవేలే

నీ కలలను జూపించవే ఓ కనకదుర్గ

విజయాలే ఇయ్యవే… మా కష్టాలే కొయ్యవే

సింహవాహిని నీవే మాతంగివే

పతిత పావని ప్రచండిరా

సుందర మీనాక్షివే శృంగేరివే

వాత్సల్యాన వారాహివే

శక్తికంతటికి మూలపుటమ్మ

ఉగ్రరూపిణివే అమ్మ… ఉనికి నీవేనే

శాంతస్వరూపిణి శీతల దేవి

చాముండేశ్వరివే తల్లి చల్లగ జూడమ్మా

చక్రధారివి నీవే శ్రీ చక్రాన

కొలువై ఉన్న ఇలవేల్పువే

కుంకుమ సిందూరాల సుందరివమ్మా

పసుపురంగుల పసిడి బొమ్మ

మంచు కొండల్లో వైష్ణవిదేవి

అగ్ని రూపిణివే మాత… అభయం నీవేనే

కొంగుబంగారం నీవే రుద్రాణి

అణువులో నీవే అమ్మ విశ్వమే నీదే

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow