201. చిన్ని చిన్ని బాలుడే మణికంఠ - Chinni Chinni Baalude - అయ్యప్ప స్వామి భజన పాటల లిరిక్స్

```html
🕉️ చిన్ని చిన్ని బాలుడే మణికంఠ 🕉️
చిన్ని చిన్ని బాలుడే మణికంఠ
చిన్నారి పసి బాలుడే
|| చిన్ని చిన్ని ||
శివకేశవుల ముద్దుబిడ్డగా మణికంఠ
పసిబాల రూపాన జన్మించినాడే మణికంఠ
పుట్టగానే నాగు నీడలో మణికంఠ
శయనించిన పంబ బాలుడే మణికంఠ
వేటకోచ్చిన రాజును చూడే
పసిబాల రూపాన కనిపించినాడే
|| చిన్ని చిన్ని ||
పందాల రాణి ఓడి లోనా మణికంఠ
లాలలు పోసే భాగ్యము పొందే మణికంఠ
చందమామ కథలను చెప్పి మణికంఠ
గోరుముద్దలే తినిపించినాదే మణికంఠ
ఆ తల్లి తండ్రి ఓడి లోన
నిదురించిన దేవుడవయ్యా
|| చిన్ని చిన్ని ||
గురువు సన్నిధిలో చేరినవయ్యా మణికంఠ
వేద విద్యలే నేర్చినవయ్యా మణికంఠ
పుట్టి మూగ గుడ్డివాడికే మణికంఠ
రెండు కళ్ళనే ఇచ్చినావయ్యా మణికంఠ
గురుస్వామి బాధను చూసినవయ్యా
గురు దక్షిణే తీర్చినవయ్యా
|| చిన్ని చిన్ని ||
ఆ తల్లి మాటను జవదాటక మణికంఠ
పులిపాలకే బయలుదేరేనా మణికంఠ
ధనసు భాణమును చేతబట్టిన మణికంఠ
అటుకులు బెల్లం మూట గట్టిన మణికంఠ
అ ఘోర అడవిలో పయనించినాడ
మహిషి మర్దనం మర్దించినాడ
|| చిన్ని చిన్ని ||
పులి పైన ఎక్కి వచ్చిన మణికంఠ
పులిపాలనే తెచ్చినవయ్యా మణికంఠ
శబరి కొండపై బాణమిసేరేనా మణికంఠ
దివ్య మెట్ల పైన కొలువుదీరిన మణికంఠ
ఆ తల్లిదండ్రుల ఆశ మేరకే
కాంతగిరిపై జ్యోతిగా వెలిగే
|| చిన్ని చిన్ని ||
🙏 స్వామియే శరణం అయ్యప్ప 🙏
```

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow