🙏 ఎమిజేతు నీదుపూజ ఎట్లజేతునీదుసేవ 🙏
మాలవేసుకుందమంటే పూజవిధము తెలియదాయె
నీ పూజవిధము వింటుంటే స్వామి ఓ అయ్యప్ప
నిదురరంతా కరువాయె స్వామి ఓ అయ్యప్ప
నీ పూజవిధము వింటుంటే స్వామి ఓ అయ్యప్ప
నిదురరంతా కరువాయె స్వామి ఓ అయ్యప్ప
చరణం 1
మాలైతే వేసుకుంటి దీక్షనేమో పూనుకుంటి (2)
నల్లాటి బట్టలేసి నుదుట గంధం బొట్టుపెట్టి (2)
శరణమంటే సిగ్గాయె స్వామి ఓ అయ్యప్ప
శరణుఘోష రాకపాయె స్వామి ఓ అయ్యప్ప
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
చరణం 2
ఇరుముడి ఎత్తుకోని ఎరుమేలి దరికిజేరి (2)
పెదపాదం పోదమంటే ఆలుపిల్ల యాదికొచ్చె
కరిమాల గుట్టంటే స్వామి ఓ అయ్యప్ప
కాళ్లుచేతులనవట్టె స్వామి ఓ అయ్యప్ప
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
చరణం 3
కిందమీద పడుకుంటూ కరిమాల గుట్టనెక్కి (2)
పాపాలు పోతాయని పంబనది చేరుకుంటి (2)
పాపాలు పారిపాయె స్వామి ఓ అయ్యప్ప
ప్రాణం అలసటదీరె స్వామి ఓ అయ్యప్ప
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
చరణం 4
కన్నెమూల గణపతిని కనులారా సేవించి (2)
కష్టాసుఖములనక కాంతమలై గిరిజేరితి (2)
పద్దెందిమెట్లనెక్కి స్వామి ఓ అయ్యప్ప
పావనుడనైపోతిని స్వామి ఓ అయ్యప్ప
॥ దివ్య దర్శనం ॥
కోటిసూర్యకాంతిగల స్వామి ఓ అయ్యప్పదివ్యమైన రూపుజూస్తి స్వామి ఓ అయ్యప్ప
🕉️ స్వామియే శరణం అయ్యప్ప 🕉️