🙏 అమ్మా వచ్చిందే 🙏
బెజవాడ కనక దుర్గమ్మ భక్తి గీతం
అమ్మా వచ్చిందే.... తల్లీ వచ్చిందే.....
బెజవాడ కనక దుర్గమ్మ వచ్చిందే
అమ్మా వచ్చిందే తల్లీ వచ్చిందే
బెజవాడ కనక దుర్గమ్మ వచ్చిందే
1
ముగ్గరమ్మల మూలపుటమ్మ, సృష్టికి మూలం నేవేనమ్మ
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు పూజించే శక్తివి నీవే
(అమ్మా వచ్చిందే)
✦ ✦ ✦
2
కృష్ణ నదిలో జలకమాడి, కాళ్ళకు పారాణి పెట్టి
మొకమంతా పసుపుతోన ఎర్రని బొట్టు పెట్టి
కాళ్ళకు గజ్జెలు కట్టుకోని, కంటికి కాటుక పెట్టుకోని
పట్టుచీరనే కట్టుకోని.. మహలక్ష్మిలా.... వచ్చే తల్లీ
(అమ్మా వచ్చిందే)
✦ ✦ ✦
3
కంచిలోన కామాక్షివి నీవే, మధురలోన మీనక్షివి నీవే
దుర్గమ్మ తల్లివి నీవే, కదిలొచ్చే కాళి మాతవు నీవే
చేతికి గాజులు వేసుకోని, చేతిలో శూలం పట్టుకొని
పెద్దపులినే ఎక్కివచ్చే... ముల్లోకాలు తిరిగేతల్లి....
(అమ్మా వచ్చిందే)
✦ ✦ ✦
4
ఆది శక్తివి నీవే, అన్నపూర్ణవీ నీవే
సర్వ జనులుకాచే సర్వ శక్తివి నీవే
దండాలు దండాలు అమ్మోరు తల్లో....
శతకోటి దండాలు అమ్మోరు తల్లో....
కరుణించి కాపాడు అమ్మోరు తల్లో....
మమ్మేలే మాతల్లి అమ్మోరు తల్లో....
(అమ్మా వచ్చిందే)
🎵 ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి 🎵
▶ పాట వినండి