🙏 అమ్మా దుర్గమ్మ 🙏
తల్లి దుర్గమ్మ - సర్వ రూప స్వరూపిణి
అమ్మా దుర్గమ్మ... తల్లి దుర్గమ్మ
మమ్మేలగా కొండలు దిగిరావే...మా చల్లని తల్లి
నీ బిడ్డల బాధలు కనరావే .. మా బంగారు తల్లి
(అమ్మా)
1
ఉగ్ర & శాంత రూపాలు
కలకత్తాలో వెలిసిన కాళికవే.. ఓ ఉగ్ర రూపమా
శ్రీశైలం లో వెలిసిన అంబికవే.. ఓ శాంతరుపమా
మధురలోన మేనాక్షివి నీవే...., కంచిలోన కామాక్షివి నీవే...
బెజవాడ ఆ దుర్గవు నీవే.., బాసరలో వెలిసిన శారద నీవే....
(అమ్మా)
✦ ✦ ✦
2
ధనలక్ష్మి & గౌరీ రూపాలు
ఇంట వెలసిన దీపం నీవమ్మా... ధనలక్ష్మి రూపమా
ముచ్చట గోలోపే ముద్దుగుమ్మవమ్మ ఓ గౌరీ రూపమా
బొంబాయిలో ఆ అమ్మవు నీవే..., దుర్గాపూర్ భావనివి నీవే..
చోటానిక్కర్ భగవతి నీవే.., మైసిగండి మైసమ్మవు నీవే...
(అమ్మా)
✦ ✦ ✦
3
ఓంకార & ఆరాధ్య రూపాలు
నిత్య పూజలు హారతి నీకమ్మా.. ఓంకార రూపమా
దూపదీప నైవేద్యం నీకమ్మా ఆరాధ్య దైవమా
పొలిమేర పోచమ్మవు నీవే.., ఉజ్జయిని మహంకాళివి నీవే..
శబరి కొండపై వేలిసియున్న ఆ మాలిక మంజు మాతవు నీవే....
(అమ్మా)
🎵 ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి 🎵
▶ పాట వినండి