ముక్కంటి ముత్తు కుమార
॥ మణికంఠ సోదరా మమ్మేలు దేవర ॥
పల్లవి
ముక్కంటి ముత్తు కుమార మణికంఠ సోదరా
మణికంఠ సోదరా మమ్మేలు దేవర
1 వ చరణం
నీ ఆట పాట చూసి నర్తించే నీలి నెమలి
నీ నెమలి ఆటలు చూసి మురిసేను భక్తకోటి
మురిసేను భక్తకోటి మదిలోన నిన్నే తలచి
2 వ చరణం
పన్నీరు శిరమున జల్లి పట్టాంచు వస్త్రము చుట్టి
చందనము చేత తీసి తనువంతా నీకు పూసి
విభూతి తిలకం పెట్టి అర విరిసిన పువ్వులతోటి
అర విరిసిన పువ్వులతోటి అర్చనలే చేసే మయ్య
3 వ చరణం
పళనిలో ఉన్న స్వామి పళనిమలై చేరుకుందు
కాషాయం కట్టుకుని కావడిని ఎత్తుకొని
నీ ఆటలు ఆడుకుంటూ నీ పాటలు పాడుకుంటూ......