వందనం గణపతి మహారాజా
॥ శ్రీ గణేశాయ నమః ॥
పల్లవి
వందనం గణపతి మహారాజా
అభి వందనం గణపతి మహారాజా
"మహారాజా.... మహారాజా ॥ వందనం ॥"
1 వ చరణం
దోర బొజ్జ స్వామికి పాదాభివందనం
ఉండ్రాల దేవునికి హృదయాభి వందనం
గిరిజా తనయునికి అరుదైన వందనం
పరమేశ్వర పుత్రునికి ప్రథమ పూజ్య వందనం ॥ వందనం ॥
2 వ చరణం
మూషికా వాహనా ముద్దు లొలుకు గజాననా
ముందుగా చేసెదము నీ నామ స్మరణ
వినాయకా వినాయకా వినాయకా అంటూ
భజియింతుము కరుణింపగ రావయ్య స్వామి ॥ వందనం ॥
3 వ చరణం
విద్యనొసగు ధాతవై త్రిలోకాల నేతవై
ఏక దంత ధారుడవై వెలుగొందు విఘ్నేశా
దేవతలే నిను కొలచి తరియించుచుండా
నీ ఘనతను పొగడంగ మేమెంత స్వామి ॥ వందనం ॥
🎧 ఈ పాటను ఎలా పాడాలో వినడానికి:
▶ ఇక్కడ టచ్ చేసి వినండి