పౌర్ణమి వెన్నెలలో శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ- ప్రతి అడుగు శివార్పణమే- ఆ విశేషాలు ఇవే!

Srikalahasti Giripradakshina

శ్రీకాళహస్తిలో కైలాసగిరి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం చిరకాలంగా కొనసాగుతున్న పవిత్ర శైవ సంప్రదాయం

Srikalahasti Pournami Giripradakshina: ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో నిర్వహించే గిరి ప్రదక్షిణం. గిరి ప్రదక్షిణ నిర్వహించడం చిరకాలంగా కొనసాగుతున్న పవిత్ర సంప్రదాయం. గిరి ప్రదక్షిణ చేయడానికి పౌర్ణమి శ్రేష్టం! గిరి ప్రదక్షిణంతో లభించే మానసిక ప్రశాంత ఆధ్యాత్మిక చింతన!

గిరి ప్రదక్షిణ అంటే?

గిరి ప్రదక్షిణ అనగా పవిత్రమైన పర్వతానికి లేదా కొండకు భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణ చేయడం. హిందూ ధర్మంలో గిరి ప్రదక్షిణకు అత్యంత విశేషమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ప్రత్యేకించి అరుణాచలం, సింహాచలం వంటి పుణ్యక్షేత్రాలలో గిరి ప్రదక్షిణను అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ కోవలోకి చెందినదే శ్రీ కాళహస్తి గిరి ప్రదక్షిణం. పరమ పవిత్రమైన శ్రీ కాళహస్తి క్షేత్రంలో పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ నిర్వహించడం సంప్రదాయం.

శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణ సర్వదోష నివారణ

పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలోని కైలాసగిరి ప్రదక్షిణ నిర్వహించడం చిరకాలంగా కొనసాగుతున్న పవిత్ర సంప్రదాయం. పౌర్ణమి చంద్రుడు తన సంపూర్ణ కళలతో ప్రకాశించే ఈ పుణ్యదినాన పరమశివుని స్మరిస్తూ, "ఓం నమః శివాయ" అనే పంచాక్షరీ నామ జపంతో కైలాస గిరి ప్రదక్షిణ చేయడానికి వేలాది మంది భక్తులు శ్రీకాళహస్తికి తరలివస్తారు. భక్తి, వినయం, శివస్మరణతో చేసే ఈ ప్రదక్షిణ ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు.

పున్నమి వెన్నెలలో శివధ్యానం - ఆధ్యాత్మిక సౌరభం

పౌర్ణమి వెన్నెల్లో శివధ్యానంతో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మనస్సుకు ప్రశాంతత, భగవంతునిపై విశ్వాసం, ఆధ్యాత్మిక చింతన మరింత పెరుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. కుటుంబ క్షేమం, ఆయురారోగ్యం, సకల శుభాలు కలగాలని ప్రార్థిస్తూ అనేక మంది ఈ పవిత్ర సేవలో పాల్గొంటారు.

భూ ప్రదక్షిణ ఫలితం & పాప విమోచనం

గిరి ప్రదక్షిణ అనేది కేవలం ఒక నడక కాదు. ప్రతి అడుగును శివార్పణంగా భావిస్తూ, శివ నామస్మరణతో, భక్తిశ్రద్ధలతో చేసే ఒక ఆధ్యాత్మిక సాధన. స్వయంగా భగవంతుడే కొలువైన పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సమస్త భూమండలానికి ప్రదక్షిణ చేసినంత పుణ్యం, విశేషమైన ఫలితం లభిస్తుందని నమ్ముతారు. కైలాసనాథుని గిరి ప్రదక్షిణ చేసే క్రమంలో ప్రతి అడుగుకూ విశేషమైన శక్తి ఉంటుందని, భక్తులు తమ మనసును దైవంపై లగ్నం చేసి ప్రదక్షిణ చేయడం వల్ల సంచిత పాపాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక విశ్వాసం.

మానసిక ప్రశాంతత, ఆరోగ్య లాభం

కొండ చుట్టూ ఉన్న ప్రకృతి వాతావరణంలో, ఔషధ గుణాలున్న గాలిని పీల్చుకుంటూ నడవడం వల్ల శరీరానికి చక్కటి వ్యాయామం అందడంతో పాటు మనసుకు ప్రశాంతత కలుగుతుంది. సాధారణ రోజుల కంటే పౌర్ణమి రోజుల్లో, ముఖ్యంగా కార్తిక పౌర్ణమి, గురుపూర్ణిమ, మాఘ పౌర్ణమి వంటి విశేష తిథులలో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల రెట్టింపు ఆధ్యాత్మిక శక్తి, దైవ అనుగ్రహం ప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.

ప్రతి అడుగు శివార్పణం - దేవస్థానం ఏర్పాట్లు

ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం వారు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దేవస్థానం 3వ గేటు వద్ద గల శ్రీ జల వినాయక స్వామి వారి ఆలయం నుంచి సాయంత్రం 6.00 గంటలకు కైలాసగిరి ప్రదక్షిణకి వెళ్లే భక్తుల కోసం ఉచిత బస్సు సౌకర్యం కలదు. గిరి ప్రదక్షిణకు విచ్చేసే భక్తులకు ఉచితంగా అల్పాహార ప్రసాద వితరణ జరుగుతుంది. గిరి ప్రదక్షిణం కేవలం నడక మాత్రమే కాదు ఒక ఆధ్యాత్మిక సాధన. అందుకే ఈ పవిత్ర సందర్భంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసే భక్తులు దేవస్థానం కల్పిస్తున్న ఉచిత బస్సు సౌకర్యం, అల్పాహారం, ప్రసాద వితరణ వంటి సేవలను సద్వినియోగం చేసుకొని, క్రమశిక్షణతో, పరిశుభ్రతను పాటిస్తూ ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహాన్ని పొందాలని దేవస్థానం అధికారులు కోరుతున్నారు.

మనం కూడా ఈ పౌర్ణమికి శ్రీ కాళహస్తి గిరి ప్రదక్షిణ చేసి మోక్షాన్ని పొందుదాం.

🙏 ఓం నమః శివాయ! 🙏
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow