JCL News TV
భక్తి మార్గం - ఆధ్యాత్మిక ప్రస్థానం
కైలాసగిరి వాసా...రా రా ఓ గౌరీశా
పిలిచిన పలుకవు భక్తుల కానవు
పల్లవి
పిలిచిన పలుకవు భక్తుల కానవు
ఎంతని నిను వేడను ఏమని కొనియాడను
కైలాసగిరి వాసా...రా రా ఓ గౌరీశా
చరణం 1
1
గరళము మింగి నీవు నీలకంఠుడైనావు
శిరమున గంగ దాల్చి జటాధారివైనావు
అడిగిన వరాలిచ్చే బోళా శంకరా
సర్పరాజులందరూ నీ తోడుగా దిగిరావా
చరణం 2
2
అర్ధనారీశ్వరుడై ఆనతిచ్చి మము బ్రోవ
లోకాల శంకరుడా మా స్తుతులను గైకొనరా
నంది వాహనమెక్కి బంధనాలు తొలగించ
విభూతి రేఖలతో మాకై నువు దిగి రావా
చరణం 3
3
కోటిలింగాలలోన లింగేశ్వరుడైనావు
డమరుక నాదముతో రుద్ర నేత్రుడయినావు
సప్త మహర్షులంతా భక్తితో నిను కొలువంగా
పార్వతీ సమేతుడవై పరమేశా దిగిరావా
🙏
ఓం నమః శివాయ