JCL News TV
భక్తి మార్గం - ఆధ్యాత్మిక ప్రస్థానం
ఎవరికీ ఎవరయ్య ఈశ్వరా
ఎవరుంటే నేమయ్య శంకర
పల్లవి
ఎవరికీ ఎవరయ్య ఈశ్వరా
ఎవరుంటే నేమయ్య శంకర
మరు జన్మ రాకుండ చూడరా
నీ దయ ఉంటె చాలురా ఈశ్వరా
నీ దయ ఉంటే చాలు పరమేశ్వరా
చరణం 1
ఈ కనులు తెరువగా జననం
ఈ కనులు మూస్తేనె మరణం
రెప్ప పాటయ్య ఈ జీవనం
విధి మార్చ తరమా బ్రహ్మకైన
పరమేశ్వరా...ఆ...ఆ...ఆ.
పరమేశ్వరా కరుణించ రావా
హర హరా మహాదేవ శంభో శంకర
చరణం 2
నేనూ నేననే అహము
నాది నాదనే స్వార్థమూ
కలుషితంబయ్యె ఈ జీవితం
ఇక చాలునయ్యా ఈ నాటకం
లయ కారకా…ఆ….ఆ….ఆ
లయ కారకా ఇక చాలికా
అర్ధనారీశ్వరా గౌరీ శంకరా
🙏
ఓం నమః శివాయ