🌺 తొలియాత్రికుడా శరణాగతుడా 🌺
తొలియాత్రికుడా శరణాగతుడా ॥2॥
ఇరుముడి మూటను తలను పెట్టి
కొండ కోనలు దాటి దాటి ॥2॥
పదునెనిమిది మెట్లెక్కుట
ఎప్పుడు ఎప్పుడయా ॥2॥
మండల జ్యోతికా...
మకర జ్యోతికా ॥2॥
అయ్యప్ప దింతక తోం
స్వామి దింతక తోం
స్వచ్ఛంగా స్నానమాడి
అయ్యప్పను తలచుకొని
శరణం శరణం అంటూ
వేడుకొంటివా
కొబ్బరాకుల పందిరివేసి
ముడుపు మూట చేర్చి కట్టి
శబరిగిరి పోవుటకు
సిద్ధమైతివా
అయ్యప్ప దింతక తోం
స్వామి దింతక తోం
ఎరుమేలి పుణ్యస్థలం
ముట్టుకోవలె
విభూది రాశి పెట్ట తుళ్ళి
పాట పాడుదాం
చిన్ని చిన్ని గుడిసెలలో
భజన చేయాలి
పిదప అడవులన్ని దాటి దాటి
పంపా చేరాలి
అయ్యప్ప దింతక తోం
స్వామి దింతక తోం
గణపతికి కొబ్బరికాయ
కొట్టి చూపాలి
పిదప ముడుపు మూట తలను పెట్టి
కొండ ఎక్కాలి
పద్దెనిమిది మెట్లెక్కి
అయ్యని చూడాలి
పిదప అభిషేకమంతా
కళ్లారా చూడాలి
అయ్యప్ప దింతక తోం
స్వామి దింతక తోం
॥ స్వామియే శరణం అయ్యప్ప ॥