62. ధనసు బాణం చేతబట్టి / Dhanasu Banam Chetabatti - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

🌺 ధనుసు బాణం చేతబట్టి 🌺


ధనుసు బాణం చేతబట్టి
దండిగ పెద్దపులిని ఎక్కి ॥2॥

ధరలోన ధర్మశాస్తా...
దండమిదిగో స్వామి మా దరికి రావేమి ॥2॥

ఏటేట మాల వేసి వేడుకతో పూజ చేసి
నల్లాని బట్టలేసి నొసటిన గంధం బెట్టి
ఇంటింటా భజన చేసి భక్తితో ఇరుముడిని కట్టి
బయలుదేరి వస్తున్నా...
భక్తులము స్వామీ మాకభయమీయవేమి ॥2॥

॥ ధనుసు బాణం ॥

బ్రహ్మచర్య వ్రతము బట్టి
భ్రాంతులన్ని వదిలిపెట్టి
శబరిమల చేరుకొని చేతులెత్తి మొక్కుకొని
పంబా నదిలో స్నానమాడి వినయముతో పూజలీడి
పరవశమొందితి స్వామీ...
పారిపోయె స్వామి పాపాలు మమ్ము వీడి ॥2॥

॥ ధనుసు బాణం ॥

ముడుపు మొక్కులిచ్చుకుంటి
ముక్తి నాకు ఇవ్వమంటి
మకరజ్యోతి చూచి నిన్ను మనసునిండా నింపుకుంటి
పెద్ద పెద్ద అడవి చూడు
పెనుగాలి విసురు చూడు
మహిషిని మర్దించినావు...
మమ్ము మన్నించవేమి మా దరికి రావేమి ॥2॥


॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow