నీ దీక్ష తీసుకున్న నిమిషములోనే నాలోన... - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

🌺 స్వామి దింతకతోమ్ తాండనతం 🌺


స్వామి దింతకతోమ్ తాండనతం
అయ్యప్ప దిందకతోమ్... ॥2॥

నీ దీక్ష తీసుకున్న నిమిషములోనే
నాలోన ఉప్పొంగెను నవ చైతన్యం ॥2॥

నీ దివ్య స్వరూపమే కన్నులలోన
నీ భవ్య శరణుఘోష కంఠములోన
నీ మంగళ ప్రతిమ తులసిమాల మెడను వేయగా
నా గుండెలోనే నీ జ్యోతి నిండి వెలిగెను

॥ నీ దీక్ష ॥

నా హృదయం ఒక తంబుర
నీ నామం నాదములా
నా జీవన గానంలో
నను వదలక నిను వేడా

నీ తలపులు నా తలలో నిరంతరం సాగాలి
నా తలపై ఇరుముడివై నీ చెంతకు నడవాలి
నాడులలోనవ నాడులలో జీవధారవైనావయ్యా
నా ఆత్మజ్యోతి వెలుగవు నీవే జ్యోతి స్వరూపా

॥ నీ దీక్ష ॥

వేదభాష్య శాస్త్రాల పేరైనా తెలిసేనా
ఆ గీతా రహస్యాలు అవగాహనమయ్యేనా
సాధారణ మానవుడకు సమకూరున విజ్ఞానం
భక్తి మార్గమొకటేగా పాటించేగా మాకు గతి

పదములనే కొలిచి పదములుగా
పదములలో భక్తి నింపి
ప్రాణమున్న వరకు
గాన సేవ చేసేదనయ్యా

॥ నీ దీక్ష ॥


॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow