కనులారా చూడాలి / Kanulara chudali - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

🌺 చకంగా పోయి ఒస్తానే నా కన్నా తల్లీ 🌺


చకంగా పోయి ఒస్తానే నా కన్నా తల్లీ
అయ్యప్పను చూసి వస్తానే నా కన్నా తల్లీ
కన్నీరు పెట్టకే నా తల్లీ
॥ చకంగా ॥

కొండ కొనలు ఉంటాయని భయపడకే కన్నా తల్లీ
అడవి దారి ఉంటుందని దిగులు చెందకే తల్లీ
గురుస్వామి వెంటే ఉంటాడే నా కన్నా తల్లీ
కన్నీరు పెట్టకే నా తల్లీ
॥ చకంగా ॥

మళ్లీ మాల వేయాలంటే మళ్లీ ఏడాది రావాలంట
అయ్యప్పను చూడనిద్దే నా మనసే నిలవదమ్మా
ఏడాదికొక్కసారి నా కన్నా తల్లీ
అయ్యప్పను చూసి వస్తానే నా కన్నా తల్లీ
కన్నీరు పెట్టకే నా తల్లీ
॥ చకంగా ॥

అయ్యప్ప పాటలు వింటే నను నేనే మరచిపోతా
ఆ స్వామి పాటలు నాకే ప్రాణాలు పోసేనమ్మా
కొన్ని ఊపిరి ఉన్నవరకు నా కన్నా తల్లీ
అయ్యప్పను చూసి వస్తానే నా కన్నా తల్లీ
కన్నీరు పెట్టకే నా తల్లీ
॥ చకంగా ॥


॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow