@ మా తల్లీతండ్రివినీవే @ maa tallii tandrivi neeve @ శ్రీ లక్ష్మి నారసింహ స్వామి భజన పాటల లిరిక్స్

॥ మా తల్లీతండ్రివి నీవే మా స్వామి నరసింహ ॥
మా తల్లీతండ్రివి నీవే మా స్వామి నరసింహ
మా తోడునీడ నీవే మా స్వామి నరసింహ
* ఊరేదైనా పేరేదైన అన్నియు నీవే
మా స్వామి నరసింహ
|| మా తల్లితండ్రి ||
అహోబిలంబున వెలసితివయ్య ఉగ్ర నరసింహ
స్వామి ఉగ్రనరసింహా స్వామి

సింహాచలమున వెలసితివయ్యా వరాహ నరసింహా
స్వామి వరాహనరసింహా స్వామి
* ఎల్లజగంబులేలే వాడవు సల్లగమమ్ము కాపాడేవాడవు
|| మా తల్లితండ్రి ||
ప్రహ్లాదుడు పిలిచిన వెంబడే పరుగున వచ్చావు
స్వామి పరుగున వచ్చావు స్వామి
|| ౨ ||
హిరణ్యకశపుని గుండెను చీల్చి నెత్తురతాగావో
స్వామి నెత్తురతాగావో స్వామి
|| ౨ ||
* ఊరేదైన పేరేదైన అన్నియునీవే మా నరసింహ
|| మా తల్లితండ్రి ||
పాలమూరులో వెలసితివయ్యా లక్ష్మీనరసింహ
స్వామి లక్ష్మీనరసింహస్వామి

వన్నెల చిన్నెల చెంచులక్ష్మిని వరించ వచ్చావు
స్వామి వరించ వచ్చావు
ఎల్లజగంబులేలే వాడవు సల్లగమమ్ము కాపాడేవాడవు
|| మా తల్లితండ్రి ||
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి 🙏
```

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow