Ne Mahime Vinnamu 21. నీ మహిమే విన్నాము / - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

నీ మహిమే విన్నాము

పల్లవి:
నీ మహిమే విన్నాము నిన్ను నమ్మి వచ్చాము
నీ రూపం చూశాము శరణమయ్యా
శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా

1. అందాల బాలుడా – ఆనంద రూపుడా
అందరిని కాపాడూ శరణం అయ్యా!

|| శరణం అయ్యప్పా ||

2. మణికంఠ దేవుడా – మహాదేవ పుత్రుడా
మమ్మేలు కోవయ్యా శరణం అయ్యా!

|| శరణం అయ్యప్పా ||

3. కరిమల వాసుడా – కోమల రూపుడా
కాపాడ రావయ్యా శరణం అయ్యా!

|| శరణం అయ్యప్పా ||

4. పంపా నివాసుడా – పరబ్రహ్మ స్వరూపుడా
పందాల బాల నీకు శరణం అయ్యా!

|| శరణం అయ్యప్పా ||

5. బంగారు బాటయ్య – కొండెక్కి రావయ్యా
శరణం అంటే చాలు సాగునయ్యా!

|| శరణం అయ్యప్పా ||

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow