ఈ జన్మకిది చాలయా (దేవా)
కరుణామయా సాగర
ఇలలో నీవే కళలో నీవే
నీవు లేని చోటే దయా దేవా
(ఈ జన్మకిది చాలయా)
పుత్రులు లేని పందళ రాజుకు
పసి బాలునిగా దొరికితివయ్యా
సకల నీకలేని జీవుల బ్రతుకున
చిరు వెలుగులు చిందించరావా
అలలో నీవే శిలలో నీవే
నీవు లేని చోటే దయా దేవా
(ఈ జన్మకిది చాలయా)
నిత్యము నిన్నే కొలిచిన వారికి
సత్యములెన్నో చూపితివయ్యా
మదిలో మెదిలే మహిషిని చంపి
ధర్మ మార్గమున నడిపింప రావా
ఝరిలో నీవే దరిలో నీవే
నీవు లేని చోటే దయా దేవా
(ఈ జన్మకిది చాలయా)
నీ శరణు ఘోషలో కరిగి పులకించని
మానవ జన్మల బ్రతుకేలా
నీ నామ స్మరణలో మోక్షమొందని
మానవ జన్మ ఏలా
శరణం శబరీశ శరణం శబరీశ
ఇలలో నీవే కళలో నీవే
నీవు లేని చోటే దయా దేవా
(ఈ జన్మకిది చాలయా)