అయ్యా దర్శనం
అయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం
బంగారుకొండపైన అయ్యా దర్శనం
రాయి రప్పుల్లో అడవి ముళ్ళ బాటల్లో
అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చినామయ్య (2)
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
|| అయ్యా దర్శనం ||
దివ్యమైన నీ వ్రతంతో మాల వేసి
మొక్కుబడి మూట కట్టి వస్తున్నామయ్యా (2)
పంపలో స్నానం చేసి పాపాలు వదిలి
సేవ చేస్తూ పాటలు పాడి వస్తున్నామయ్యా (2)
ఎక్కుట కష్టము కొండ ఎక్కుట కష్టము
నీ చేయి కాచి కరిమల నీలిమల ఎక్కించాలయ్యా
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
|| అయ్యా దర్శనం ||
నీ సోపానలెక్కి వచ్చి మొక్కెమయ్యప్ప
మొదటి మెట్టున కొబ్బరికాయ కొట్టినామయ్యా (2)
పద్దెనిమిది మెట్లు కంటికి అద్దుకొని
సన్నిధానంలో నిన్నే కొలిచేమయ్యప్ప (2)
దోషం పోగొట్టి స్వామి మోక్షం ఇవ్వయ్యా
స్వామి కన్నుల వెన్నెల జల్లులతో కావగ రావయ్యా (2)
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
|| అయ్యా దర్శనం ||