24 Kondavaadu maa Ayyapp కొండవాడు మా అయ్యప్పా / a - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

ఓం ఓం అయ్యప్ప శరణాలు

ఓం ఓం అయ్యప్ప శరణాలు అయ్యప్ప
శరణాలు శరణాలు అయ్యప్పకు శరణాలు

కొండవాడు మా అయ్యప్పా
జాలి గుండె వాడు మా అయ్యప్పా
ఓహో హో అయ్యప్పా శరణమో అయ్యప్పా (2)

|| కొండవాడు మా అయ్యప్పా ||

1. నీలాల నింగిలోన చుక్కల్లో చందురుడు
నీలగిరి కొండల్లో కొలువుతీరి ఉన్నావు
నీలకంఠుని పుత్రుడు అయ్యప్ప
మణికంఠ నామదేయుడు ఓహో

|| కొండవాడు మా అయ్యప్పా ||

2. రాగాలు మాకు రావు తాళాలు మాకు లేవు
అరుపులే మా పిలుపులు అయ్యప్ప
శరణాలే మేలుకొలుపులు ఓహో

|| కొండవాడు మా అయ్యప్పా ||

3. పెద్ద దారిలోన నడిచి వెళ్తుంటే
చిన్న దారిలోన నడచి వెళ్తుంటే
దారిలోన కనిపిస్తాడు అయ్యప్ప
శరణాలే పలికిస్తాడు ఓహో

|| కొండవాడు మా అయ్యప్పా ||

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow