మణికంఠ మహాదేవా
మణికంఠ మహాదేవా మమ్ము గన్న తండ్రివే
నిండు జగతిలో నీకు నిత్య పూజలు చేయ
మణికంఠ మహాదేవ శివ కేశవుల తనయ (2)
నిత్య కళ్యాణంబు పచ్చ తోరణమే మణికంఠ మహాదేవ (2)
మలయాళ దేశాన ఐదు కొండల నడుమా
శబరీ కొండల పైనా కొలువుదీరిన దేవా
పడుగ ఎత్తిన పాము నీడలో మా అయ్యా
పవళించిన పంబ బాలవే మా అయ్యా
(మణికంఠ)
నిగ నిగ నీ మోము నీ ముఖము చూచితే
నిండు పున్నమి నాడు చందురున్ని బోలు
సొగసైన నీ రూపమే మా అయ్యా
అది చూసే ఆనందమే మా అయ్యా
(మణికంఠ)