శంభో శివ శివ శంకరా - పురహర భవహర ఈశ్వరా - శివ భజన పాటల లిరిక్స్

శంభో శివ శివ శంకరా - JCL News TV
JCL News TV
భక్తి మార్గం - ఆధ్యాత్మిక ప్రస్థానం
శంభో శివ శివ శంకరా
పల్లవి
శంభో శివ శివ శంకరా - పురహర భవహర ఈశ్వరా హిమగిరి మందిరా - గిరిజా సుందరా దేవ దేవ దీనబంధు దయనే చూపరా జయకర శుభకర ఈశా శశి ధరా
|| శంభో ||
చరణం 1
గరళమే నీ గళమున బంధించిన ఫణి భూషణా జగములే కాపాడిన దేవా భవ హరణా సురగణ సంసేవితా ఆశ్రిత జన రక్షకా నిరతము నీ పూజబ మరువము శుభ చరణా శరణమే కోరితి - నిను మది వేడితి సదా శివా హరోం హరా
|| శంభో ||
చరణం 2
వందనం గంగాధరా అందుకో అభయంకరా చండికా హృదయేశ్వరా మా సేవలు గైకొనరా జంగమా అహో లింగమా నీ రూపమే నిర్వికారమా ఎందును నీవుందువో ఎక్కడ వెదుకమురా అందరి హృదయాలలో పరమాత్మవు నీవేనురా సదా శివా హరోం హరా
|| శంభో ||
చరణం 3
పార్వతి పరమేశ్వరా పంతమే నీకేలరా సర్వము నీవేనని నమ్మితి కావరా పరిపరి విధముల తలచితి శుభకరా వరమువే నొసగరా భక్తవ శంకరా ధరణిలో నీ దాసుని అప్పన్నను బ్రోవరా సదా శివా హరోం హరా
|| శంభో ||
🙏 ఓం నమః శివాయ

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow