Kailasame kapurama కైలాసమే కాపురమా @ శివ భజన పాటల లిరిక్స్

కైలాసమే కాపురమా - JCL News TV
JCL News TV
భక్తి మార్గం - ఆధ్యాత్మిక ప్రస్థానం
కైలాసమే కాపురమా
శ్రీశైలం సింహద్వారమా
వెండికొండపై నివాసముండే భోళా మల్లన్నా భోళా మల్లన్నా శ్రీశైల మల్లన్నా మువ్వల మల్లన్నా మెడలో నాగుల మల్లన్నా
1
ఒక ప్రక్క గణపయ్య మరోపక్క మురుగయ్య ఇద్దరు కొడుకుల ముద్దుల తండ్రివి నీవే మల్లన్న
!!భోళా మల్లన్నా!! కైలాసమే
2
తల పైన గంగమ్మ పక్కనేమో పార్వతమ్మ ఇద్దరి భార్యల ఇష్ట దేవుడవు నీవే మల్లన్న
!!భోళా మల్లన్నా!! కైలాసమే
3
పులిచర్మము ధరియించి బిక్షాటన చేసితివయ్యా వల్లకాటిలో నివాసముండే విభూతి మల్లన్నా
!!భోళా మల్లన్నా!! కైలాసమే
4
గరళాన్ని గొంతులో దాచిన గరళా కంటుడవు నీవే ఆది అంతముల లయకారకుడవు నీవే మల్లన్న
!!భోళా మల్లన్నా!! కైలాసమే
🙏 ఓం నమః శివాయ

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow