నెమలి వాహనమెక్కి తిరిగే బాలుడికి లాలీ
పల్లవి :
నెమలి వాహనమెక్కి తిరిగే బాలుడికి లాలీ......
మురిపాల జోలాలీ.....
సురులకే సేనాధిపతికీ మధురమగు లాలీ....
ముజ్జగములా లాలీ....
పార్వతీ పరమేశ్వర తనయుడు స్వామినాధుడట....
కుమారస్వామి అట....
కృత్తికలు పాలించి పెంచిన కార్తికేయుడట....
ముద్దు బాలుడట....
నిదురకి వేలాయనట....
జోలాలి.... జోలాలి.... జోలాలి....
జోలాలి.... జోలాలి.... జోలాలి....
నెమలి వాహనమెక్కి తిరిగే బాలుడికి లాలీ....
మురిపాల జోలాలీ.....
సురులకే సేనాధిపతికీ మధురమగు లాలీ.....
ముజ్జగముల లాలీ.....
చరణం 1 :
శివుని తేజం శిశువుగా ఇల వెలసిన కథ నీది....
సర్ప రూపుగా భక్తులను కాపాడు లీలయే నీది.....
ఆరు ముఖముల జ్ఞానమూర్తిగా అవతరించేనట.....
అన్న గణపతి ముద్దుల తమ్ముడివి నీవు అట....
జోలాలి..... జోలాలి..... జోలాలి...
జోలాలి.... జోలాలి...... జోలాలి...
చరణం 2 :
దేవతల కాపాడ వెలసిన స్కంద జోలాలి....
సుబ్రహ్మణ్య జోలాలి.....
తారకాసుర వధను చేసిన మురుగ జోలాలి....
శరవణభవకు జోలాలి....
శూలధారిగా దుష్టులను శిక్షించి మా స్వామి....
నీకు జోలాలి....
వల్లీ దేవసేనల ప్రియనాధుడికి లాలీ.....
దేవ జోలాలి....
షణ్ముఖుడ జోలాలి....
జోలాలి..... జోలాలి..... జోలాలి.....
జోలాలి.... జోలాలి..... జోలాలి.....
చరణం 3 :
తల్లి పార్వతి నీకు పాడేను తీయనగు జోలాలి.....
అమ్మ గంగే పాడుతున్నది చల్లని ఒక లాలి.....
ఇహం పరములనిచ్చు గుహుడికి పాడే మరు లాలీ....
పంచభూతములన్నీ పాడెను పరమభక్తితో లాలీ....
జోలాలి.... జోలాలి.... జోలాలి.....
జోలాలి.... జోలాలి..... జోలాలి....
నెమలివాహనమెక్కి తిరిగే బాలుడికి లాలీ....
మురిపాల జోలాలీ....
సురులకే సేనాధిపతికీ మధురమగు లాలీ...
ముజ్జగముల లాలీ....
పార్వతీ పరమేశ్వర తనయుడు స్వామినాధుడట.....
కుమార స్వామి అట...
కృత్తికలు పాలించి పెంచిన కార్తికేయుడట....
ముద్దు బాలుడట....
నిదురకు వేలాయనట.....
జోలాలి...... జోలాలి...... జోలాలి.....
జోలాలి...... జోలాలి....... జోలాలి......