🙏 నా ప్రాణ దాత నీవే 🙏
నా ప్రాణ దాత నీవే నా పంచ ప్రాణం నీవే
నా లోన కదలాడే నా జీవ నాదం నీవే
ఏ ఆశ నాకు లేదు దేవరా....
నా శ్వాస శరణుఘోష చేసేదా.... (2)
నా లోన కదలాడే నా జీవ నాదం నీవే
ఏ ఆశ నాకు లేదు దేవరా....
నా శ్వాస శరణుఘోష చేసేదా.... (2)
॥ చరణం – 1 ॥
నా మనసు ప్రతిదినము నీ స్మరణ మరువదయానా తలపు ప్రతి క్షణము నీ ధ్యాస విడవదయా (2)
నా ఉనికి నాకు లేనే లేదురా....
నాలోన నీవే నిలిచినావురా.... (2)
॥ చరణం – 2 ॥
నా కంటిపాపలోనా నీరూపు నిలిచి ఉందినా నోటి ప్రతి మాట నీ పేరే పలుకుతుంది
నా తనువులోని అణువణువునా.....
అయ్యప్ప నీవే నిండినావయా.... (2)
॥ చరణం – 3 ॥
ఏనాడో చేసిన పుణ్యం ఈనాడే ఎదురయ్యిందాఆ బ్రహ్మ రాసిన రాత ఈ జన్మ నుదుటి గీతా.... (2)
॥ చరణం – 4 ॥
మీ సేవ భాగ్యమ్ము దొరికేరా....ఈ జన్మకింకేమీ కావాలిరా.....
వరాల పసిడిమూట వాచించ లేను స్వామి
ఘనమైన ధనరాసి నే కోరలేదు స్వామి.... (2)
॥ చరణం – 5 ॥
నీ గాన సేవే నాకు సర్వమూ....ఆ సేవలోనే ఉంది స్వర్గమూ..... (2)
నా ప్రాణ దాత నీవే నా పంచ ప్రాణం నీవే
నా లోన కదలాడే నా జీవ నాదం నీవే
ఏ ఆశ నాకు లేదు దేవరా....
నా శ్వాస శరణుఘోష చేసేదా.... (2)
నా లోన కదలాడే నా జీవ నాదం నీవే
ఏ ఆశ నాకు లేదు దేవరా....
నా శ్వాస శరణుఘోష చేసేదా.... (2)
🙏 స్వామియే శరణం అయ్యప్ప 🙏
🙏 శరణం శరణం అయ్యప్ప స్వామి 🙏
🙏 శరణం శరణం అయ్యప్ప స్వామి 🙏