శరణములంటే మరణము / Sharanam Ante Maranam - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

🌺 శరణములంటే మరణము లేదూ 🌺


శరణములంటే మరణము లేదూ
అయ్యప్ప నామం తారక మంత్రం
తరుణం ఇదిరా వదలుకోకు
ధర్మశాస్తా పదములు పాడు
॥ శరణము ॥

కోరిక తీర్చే వెంకన్న నామం
కరుణయు కురిసే కపిలయ్య నామం
కలసి పుట్టిన అయ్యప్ప నామం
తలచియుంటే భువిలో క్షేమం
॥ శరణము ॥

కొండకోన యిల్లు వాకిలి
రాళ్లు ముళ్ళు మల్లెల పానుపు
కోరికలణచి భక్తితో రారా
అయ్యప్ప స్వామిని చూదాంరారా
॥ శరణము ॥

ఉండేటపుడీ లోకం చుట్టం
పోయిన మిగిలే బంధువెవరు
గురువును చేరి మాలధరించి
హరిహరసుతుని జ్యోతిగ చూడు

శరణం శరణమయ్యా స్వామి శ్రీ అయ్యప్ప
అయ్యప్పా శరణం శరణం శ్రీ అయ్యప్ప

వెన్నెలా కరిగే హృదయమున అయ్యప్పా
నివసించి కరుణతో కాపాడునులే
స్వర్ణమందిర జ్యోతి స్వరూపా
మహిషి మర్దన మోహిని పుత్రా
॥ శరణము ॥


॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow