మనోహరం మహావరం అయ్యప్ప స్వామి చరితము
మనోహరం మహావరం అయ్యప్ప స్వామి చరితము,
మరలరాదు మనకురాదు మరో ఈ జన్మము,
మరో ఈ జన్మము || మనోహరం ||
మరలరాదు మనకురాదు మరో ఈ జన్మము,
మరో ఈ జన్మము || మనోహరం ||
స్వామియే శరణమని స్వామి మాల వేయగా ||2||
వేసిన తనువు పండగా, వేయని తనువు దండగా
|| మనోహరం ||
వేసిన తనువు పండగా, వేయని తనువు దండగా
|| మనోహరం ||
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
స్వామియే శరణమని శరణు ఘోష చెప్పగా ||2||
చెప్పిన నోరు పండగా, చెప్పని నోరు దండగా
|| మనోహరం ||
చెప్పిన నోరు పండగా, చెప్పని నోరు దండగా
|| మనోహరం ||
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
స్వామియే శరణమని చేతులెత్తి మొక్కగా ||2||
మొక్కిన చేతులు పండగా, మొక్కని చేతులు దండగా
|| మనోహరం ||
మొక్కిన చేతులు పండగా, మొక్కని చేతులు దండగా
|| మనోహరం ||
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
స్వామియే శరణమని స్వామి పూజ చేయగా ||2||
చేసిన ఇల్లు పండగా, చేయని ఇల్లు దండగా
|| మనోహరం ||
చేసిన ఇల్లు పండగా, చేయని ఇల్లు దండగా
|| మనోహరం ||
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
స్వామియే శరణమని చెవులారా వినగా ||2||
విన్న చెవులు పండగా, వినని చెవులు దండగా
|| మనోహరం ||
విన్న చెవులు పండగా, వినని చెవులు దండగా
|| మనోహరం ||
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
స్వామియే శరణమని శబరీ కొండలెక్కగా ||2||
ఎక్కిన పాదము పండగా, ఎక్కని పాదము దండగా
|| మనోహరం ||
ఎక్కిన పాదము పండగా, ఎక్కని పాదము దండగా
|| మనోహరం ||
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
స్వామియే శరణమని పంబా స్నానము చేయగా ||2||
చేసిన తనవు పండగా, చేయని తనవు దండగా
|| మనోహరం ||
చేసిన తనవు పండగా, చేయని తనవు దండగా
|| మనోహరం ||
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
స్వామియే శరణమని మకర జ్యోతి చూడగా ||2||
చూసిన కనులు పండగా, చూడని కనులు దండగా
|| మనోహరం ||
చూసిన కనులు పండగా, చూడని కనులు దండగా
|| మనోహరం ||
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
॥ మోక్ష మార్గం ॥
స్వామియే శరణమని స్వామి దీక్ష బూనగా ||2||అదే అదే మోక్షము, ఇదే ఇదే పుణ్యము
|| మనోహరం ||
🕉️ స్వామియే శరణం అయ్యప్ప 🕉️