స్వామి గీతాలే పాడుదును
పల్లవి:
స్వామి గీతాలే పాడుదును
నారద తుంబుర ధోరణిలో ॥2॥
జపమాల లేదండి చేతిలో
మంత్ర శృతి మీటే తంబుర గానీ... ఈ... ఈ... ఈ... ॥2॥
స్వామి అయ్యప్ప స్వామి
శబరిగిరి స్వామీ... ॥2॥
॥ స్వామి గీతాలే ॥
చరణం – 1
ప్రాతఃకాలాన పుణ్యక్షేత్రాన
బంగరు నేలపై కూర్చుని ॥2॥
స్వర్ణగిరినాథ అయ్యప్పా
నిన్నే పుణ్యాక్షర గీతం పాడీ ॥2॥
ఏదో దివ్యానుభూతిని పొంది...
॥ స్వామి గీతాలే ॥
చరణం – 2
మనుషులొకటైన సత్యం నాకు
మణికంఠ స్వామి సెలవిచ్చే ॥2॥
మదమాత్సర్యాలు వలదే వలదని
హితోపదేశం కావించే ॥2॥
మహితోపదేశం కావించే...
॥ స్వామి గీతాలే ॥
చరణం – 3
ఉపదేశ సారాలు నన్నెంతో కదలించే
నాలోని భావాలు రేపి ॥2॥
ఈ విశ్వమంతా నీ నామస్మరణే
మారుమోగేలాగ చేతూ...
మారుమోగేలాగ చేతూ... ॥2॥
॥ స్వామి గీతాలే ॥
ముగింపు:
స్వామి అయ్యప్ప స్వామి
శబరిగిరి స్వామీ...