@ అదిగదిగో శబరిమల@ Adigadigo Shabarimala @ అయ్యప్ప భజన పాటల లిరిక్స్

🙏 అదిగదిగో శబరిమల 🙏
అదిగదిగో శబరిమల అయ్యప్పస్వామి ఉన్నమల
అదిగదిగో పళనిమల అయ్యప్ప సోదరుడు ఉన్నమల
శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్పస్వామియే
స్వామియే అయ్యపా - అయ్యప్పా స్వామియె
॥ చరణం 1 ॥
అదిగదిగో శబరిమల - శివకేశవులు ఉన్నమల
ఉన్నవారిని లేనివారిని తేడలేనిది శబరిమల
కులమొ మతమొ, జాతి భేదము తేడలేనిది శబరిమల
॥ శరణమయ్యప్ప ॥
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
॥ చరణం 2 ॥
అదిగదిగో పళనిమల శివపార్వతుల ఉన్నమల
కైలాసం వైకుంఠం కలసిఉన్నది శబరిమల
ఈశ్వర హృదయం మాధవనిలయం కలిసిఉన్నది శబరిమల
॥ శరణమయ్యప్ప ॥
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
॥ చరణం 3 ॥
అదిగదిగో పంపానది, దక్షిణభారత గంగానది
ఈశ్వర కేశవ నందునందుని పాదముకడిగిన పుణ్యనది
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
॥ చరణం 4 ॥
అదిగదిగో శబరి పీఠం భక్తజనులకిది ముక్తిపీఠం
శబరి ఎంగిలి ఆరగించిన రాముడు నడిచిన పుణ్యస్థలం
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
॥ చరణం 5 ॥
అదిగదిగో కాంతమల అక్కడ వెలువడును మకరజ్యోతి
హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామికి హారతి ఇచ్చేదీపమది
॥ శరణమయ్యప్ప ॥
స్వామియే శరణం అయ్యప్ప 🙏

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow