వందనమో వందనమో / Vandhanamo vandanamo - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

 వందనమో వందనమో వందనమో అయ్యప్ప

మల్లెపూవ్వుల వందనమయ్యా సన్నజాజుల వందనమయ్యా

చామంతి పూవ్వుల వందనమయ్యా

ముద్దబంతుల వందనమయ్యా ||2||

నీకు పాలమూరు స్వాముల వందనమో వందనమో అయ్యప్ప ||వందనమో||


కన్నెస్వాముల వందనమయ్యా - కత్తిస్వాముల వందనమయ్యా

ఘంట స్వాముల వందనమయ్యా

గధా స్వాముల వందనమయ్యా ||2||

మా గురుస్వాముల వందనమో వందనమో అయ్యప్ప ||వందనమో||


తల్లిదండ్రుల వందనమయ్యా - అన్నదమ్ముల వందనమయ్యా

అక్క చెల్లెల వందనమయ్యా

బందు మిత్రుల వందనమయ్యా ||2||

మా కుటుంబ సభ్యుల వందనమో వందనమో అయ్యప్ప ||వందనమో||


గణపతి స్వామికి వందనమయ్యా-కుమార స్వామికి వందనమయ్యా

మాళిక పురికి వందనమయ్యా

మంజుమాతలకు వందనమయ్యా ||2||

ఆ పద్దెనిమిది మెట్లకు వందనమో వందనమో అయ్యప్ప |Iవందనమో||


#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow