🕉️ ఓం ఓం అయ్యప్ప 🕉️
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప
చరణం 1
సహస్రారమే శబరి శిఖరం
బ్రహ్మ కపాలం నీ స్థానం
ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
చరణం 2
ధనుష్కోటికి ఆదిమూలమై ఉన్నది మూలాధారం
అది గణపతికే ప్రాకారం
ఎరుమేలి యాత్రకే ఆరంభం శ్రీకాళహస్తి క్షేత్రం
ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
చరణం 3
లింగాంగముల పానపట్టమే వెలిగే స్వాభిస్టానం
ఇది బ్రహ్మకు మూలస్థానం
కాలైకట్టి అను క్షేత్రం జంభుకేశ్వరం ఈ తీర్ధం
ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
చరణం 4
అరుణాచలమై వెలిగేది రుణపాశాలను త్రెంచేది
పృధ్వి జలమ్ముల దాటినది
నాభి జలజమై వెలిగేది
కలిరుంకుండ్రు అన్న పేరుతో మణిపూరకమై వెలిసేది
ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
చరణం 5
హృదయ స్థానం కరిమల
భక్తుల పాలిటి తిరిమల
పంచప్రాణముల వాయువులే శ్వాసనాళముల విలవిల
అనాహతం ఈ కరిమల అసదృసం ఈ కరిమల
ఓ ఓ ఓ ఓ ఓ
సాధకులకు ఇది గండశిల
ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
చరణం 6
నాదోంకార స్వరహారం శరీరానికొక శారీరం
శబరి పాదమున పంపాతీరం
ఆత్మ విశుద్ధికి ఆధారం
ఆకాశానికి ఆరంభం
ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
చరణం 7
కనుబొమ్మల మధ్య ఒక జీవకళ ఓం
ఆజ్ఞాచక్రపు మిళమిళ ఓం
చర్మచక్షువులకందని అవధులు ఓం
సాధించే ఈ శబరిమల అదే కాంతిమల
అదే కాంతిమల
ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప
ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప
🙏 స్వామియే శరణం అయ్యప్ప 🙏