🙏 ఆత్మ నిజమైతే 🙏
నేనే నిజమైతే నా స్వామి నిజమౌనా
నా ఆత్మ నిజమైతే పరమాత్మ నీవేగా
|| నేనే నిజమైతే ||
చరణం 1
ఆవువంటివాడు నేనైతే – పాలవంటివాడు నా స్వామియే
ఆవుకు రంగులు ఉన్నవిగాని – పాలకు రంగులు లేవుగా
|| నేనే నిజమైతే ||
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
చరణం 2
జాతివంటివాడు నేనైతే – నీతివంటివాడు నా స్వామియే
జాతికి కులములు ఉన్నవిగాని – నీతికి జాతులు లేవుగా
|| నేనే నిజమైతే ||
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
చరణం 3
పూలవంటివాడు నేనైతే – పూజవంటివాడు నా స్వామియే
పూలకు రంగులు ఉన్నవిగాని – పూజకు రంగులు లేవుగా
|| నేనే నిజమైతే ||
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
చరణం 4
చెరుకువంటివాడు నేనైతే – తీపివంటివాడు నా స్వామియే
చెరుకుకు గనుపులు ఉన్నవిగాని – తీపికి గనుపులు లేవుగా
|| నేనే నిజమైతే ||
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
చరణం 5
ఏరువంటివాడు నేనైతే – నీరువంటివాడు నా స్వామియే
ఏరుకు వంపులు ఉన్నవిగాని – నీరుకు వంపులు లేవుగా
|| నేనే నిజమైతే ||
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
చరణం 6
భజనవంటివాడు నేనైతే – భక్తివంటివాడు నా స్వామియే
భజనకు వంతులు ఉన్నవిగాని – భక్తికి వంతులు లేవుగా
|| నేనే నిజమైతే ||
🕉️ స్వామియే శరణం అయ్యప్ప 🕉️