29. ఓం ఓం అయ్యప్ప /Om om Ayyappa l అయ్యప్ప భజన పాటల లిరిక్స్

 ఓం ఓం అయ్యప్ప


ఓంకార రూప అయ్యప్ప

ఓం ఓం అయ్యప్ప

ఓంకార రూప అయ్యప్ప


సహస్రారమే శబరీ శిఖరం

బ్రహ్మ కపాలం నీ స్థానం

సహస్రారమే శబరీ శిఖరం

బ్రహ్మ కపాలం నీ స్థానం

||ఓం ఓం అయ్యప్ప||
పాటల లిరిక్స్ పుస్తకం

ధనుష్కోటికి ఆది మూలమై

ఉన్నది మూలాధారం

అది గణపతికే ప్రాకారం

ఎరుమేలి యాత్రకే ఆరంభం

శ్రీ కాళహస్తి క్షేత్రం

||ఓం ఓం అయ్యప్ప||

లింగాంగంభుల పానవట్టమే

వెలిగే స్వాధిష్ఠానం

ఇది బ్రహ్మకు మూలస్థానం

కాలైకట్టి అను క్షేత్రం

జంభుకేశ్వరం ఈ తీర్థం

||ఓం ఓం అయ్యప్ప||

అరుణాచలమై వెలిగేది

ఋణపాశాలను త్రెంచేది

పృథ్వి జలమ్ముల దాటినది

నాబి జలజమై వెలిగేది

కలిడుంకుండ్రు అన్న పేరుతో

మణిపూరకమై వెలిసేది
||ఓం ఓం అయ్యప్ప||

హృదయ స్థానం కరిమలా

భక్తుల పాలిటి సిరిమలా

పంచప్రాణముల వాయువులే

శ్వాసనాళముల విలవిల

అనాహతం ఈ కరిమల

అసదృశం ఈ కరిమల

ఓ... ఓ... ఓ...

సాధకులకు ఇది గండశిల

||ఓం ఓం అయ్యప్ప||

నాదోంకార స్వరహారం

శరీరానికొక శారీరం

శబరిపాదమున పంపాతీరం

ఆత్మ విశుద్ధికి ఆధారం

ఆకాశానికి ఆరంభం

||ఓం ఓం అయ్యప్ప||

కనుబొమల మధ్య

ఒక జీవకళా.. ఓం...

అజ్ఞాచక్రపు మిలమిల ఓం...

చర్మ చక్షువులకందని

అవధులూ...ఓం...

సాధించే ఈ శబరిమలా

అదే కాంతిమలా

అదే కాంతిమలా



ఓం ఓం అయ్యప్ప

ఓంకార రూప అయ్యప్ప

ఓం ఓం అయ్యప్ప

ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow