28. నిన్ను చూడక నేనుండగలనా. Ninu chudaka nenu - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

నిన్ను చూడక నేనుండగలనా
నీ కొండకు రాకుండ గలనా
ఈ దేహం నీదు ప్రసాదం
నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం 

||నిన్ను చూడక||
మనసున్నది నీ ధ్యానలోనే
తనువున్నది నీ సేవలోనే
ప్రతి నోట నీ చరణ నామం
నానోటే నీ మధుర గానం
నానోటే నీ మధుర గానం
||నిన్ను చూడక||
ఆ బ్రహ్మకు నే రుణపడనా
రాత రాశాడు నిను చూడగా
కనిపించే దైవాలు తల్లిదండ్రులై
జన్మనిచ్చారు ఏనాటి ఫలమో
జన్మనిచ్చారు ఏనాటి ఫలమో
||నిన్ను చూడక||
ఈ ఇహమందు ఏ కొత్త కోరికలు
ఇక రాకుండా నువ్వు చూడవా
ఈ జన్మంతా నిన్ను కొలిచి సేవింతునయ్యా
ఇక మరుజన్మ నాకివ్వకయ్య
ఇక మరుజన్మ నాకివ్వకయ్య
||నిన్ను చూడక||

ఈ పాటను

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow