సాయంకాల సమయంలో sayam kala samayamulo - భజన పాటల లిరిక్స్

 సాయంకాల సమయంలో

 సంధ్య దీపారాధనలో
వచ్చును తల్లి మహాలక్ష్మి
ఇచ్చును వరములు ఎన్నెన్నో


పాలసముద్రుని పుత్రికగా
 పరంధాముని ప్రాణసఖి
రావమ్మా ఇటు రావమ్మా
మము కరుణించగా రావమ్మా



మెడలో ఎన్నో హారాలు
సిగలో ఎన్నో పుష్పాలు
నవ్వుతూ వచ్చెను  మాయమ్మ
 మము కరుణించ గా రావమ్మా



ధనమును ఇచ్చే ధనలక్ష్మి
ధాన్యమును ఇచ్చే ధాన్యలక్ష్మి
 వరమును ఇచ్చే వరలక్ష్మి
సంతానం ఇచ్చే సంతానలక్ష్మి


అందరూ చేరి రారండి
పండ్లు పూలు తేరండి
దేవి కి అర్చన చేద్దాము
దేవి స్వరూపమే చూద్దాము

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow