@ నీలి నీలి కొండల్లోన నీలకంఠ @ neeli neeli kondallona - @ శివ భజన పాటల లిరిక్స్

స్వామియే శరణమయ్యప్ప - మల్లన్న దీక్షా గీతం
🙏 ॐ 🙏

స్వామియే శరణమయ్యప్ప

~ మల్లన్న దీక్షా గీతం ~

నీలి నీలి కొండల్లోన నీలకంఠ మల్లన్న

శ్రీశైలం కొండలమీద లింగరూప మల్లన్న

మల్లన్న మల్లన్న మాలధారణ చేసినమయ్యా మల్లన్నో

మండల దీక్ష బట్టినమయ్యా మల్లన్న

!! నీలి నీలి !!

❈ ❈ ❈

విభూతి గంధం కుంకుమ దిద్ది రుద్రాక్ష మాలవేసి

గోధుమ రంగు నీలిరంగు దుస్తులు వంటికి వేస్తే

మల్లన్నో మల్లన్నో తనువెల్ల శివమయమే మల్లన్నో

నీ పేరే మమ్ము పిలిసిరే మల్లన్న

!! నీలి నీలి !!

❈ ❈ ❈

చన్నీటి స్నానాలతో మూడుసార్లు నీ పూజలు

కామక్రోధాలు వినోదాలు విడిచి నీ సేవల

మల్లన్నో మల్లన్నో అభిషేకాలు సేసినమయ్య మల్లన్నో

నైవేధ్యాలు పెట్టినమయ్యా మల్లన్న

!! నీలి నీలి !!

❈ ❈ ❈

నేలమీదే మా నిద్రలు ఒక్కపూటే భోజనాలు

సౌరము గోళ్లు తీయకుండ సన్యాసం పుచ్చుకున్నం

మల్లన్నో మల్లన్నో నమో నమో నమః శివాయ మల్లన్నో

హరోం హర ఆత్మ నీదయా

!! నీలి నీలి !!

❈ ❈ ❈

ధూమపాన మద్యపాన మాంసాహారము లొదిలి

పాదరక్షలేయకుండ పద్దతులు మరువకుండ

మల్లన్న మల్లన్నో కఠిన దీక్ష పడితిమయా మల్లన్న

నీ దర్శన భాగ్యమీయవ

!! నీలి నీలి !!

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow