📿
🔱
🪔
🐯
📿
🕉️
అదిగదిగో పందళ దేశం
~ అయ్యప్ప స్వామి కీర్తన ~
📿 🔱 📿
అదిగదిగో పందళ దేశం అందాల రాజ్యం
అందాల రాజ్యంలో అయ్యప్ప దేవుని రూపం
కొండల నడుమ కోనల నడుమ పలికే కోయిల రాగం
కారడవుల్లో దారుల వెంట మ్రోగె నామస్మరణం "అదిగదిగో"
అందాల రాజ్యంలో అయ్యప్ప దేవుని రూపం
కొండల నడుమ కోనల నడుమ పలికే కోయిల రాగం
కారడవుల్లో దారుల వెంట మ్రోగె నామస్మరణం "అదిగదిగో"
పించిన పలికే నాథుడవు మనిషిని చంపిన దేవుడవు
కళి బాధలను తొలగించి కరిమల లోనే వెలసినవు
ఆపద్బాంధవుడవు స్వామి అనాధరక్షకుడవు నీవు
ధీనులము మేము స్వామి ఆదుకొనగా దిగి రా స్వామి "అదిగదిగో"
కళి బాధలను తొలగించి కరిమల లోనే వెలసినవు
ఆపద్బాంధవుడవు స్వామి అనాధరక్షకుడవు నీవు
ధీనులము మేము స్వామి ఆదుకొనగా దిగి రా స్వామి "అదిగదిగో"
నియమ నిష్ఠలతో స్వామి నీ మాలలనే వేసెదము
నీళమల వాసా ఓ దేవా నిత్య బ్రహ్మచారి వయ్యా
కన్నే స్వామి రూపమయ కారణ జన్ముడవు నీవు
కళలో ఇళలోన మమ్ము కంటికి రెప్పల గాపాడు "అదిగదిగో"
నీళమల వాసా ఓ దేవా నిత్య బ్రహ్మచారి వయ్యా
కన్నే స్వామి రూపమయ కారణ జన్ముడవు నీవు
కళలో ఇళలోన మమ్ము కంటికి రెప్పల గాపాడు "అదిగదిగో"
నల్లని బట్టలు కట్టెదము నుదుటన గంధము పెట్టెదము
భూతప్రేతాళను తరిమే భూతనాథ ప్రభుడవయ్యా
భూతప్రేతాళను తరిమే భూతనాథ ప్రభుడవయ్యా