ఏమి సేతురా లింగా
శ్రీ మహాశివ లింగార్చన కీర్తన
పల్లవి
ఏమి సేతురా లింగా, ఏమి సేతురా?
1
గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజలు సేదమంటే
గంగనున్న చాప కప్ప ఎంగిలంటున్నాది లింగా
మహానుభావా... మా దేవ శంభో
మా లింగ మూర్తి
మా లింగ మూర్తి
❋ ❋ ❋
2
అక్షయావుల పాడి తెచ్చి, అర్పితము చేదమంటే... ఓహో
అక్షయావుల లేగదూడ ఎంగిలంటున్నాది లింగా
మహానుభావా... మా దేవ శంభో
మా లింగ మూర్తి
మా లింగ మూర్తి
❋ ❋ ❋
3
తుమ్మి పువ్వులు తెచ్చి నీకు తుష్టుగా పూచేదమంటే... ఓహో
కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాది లింగా
మహానుభావా... మా దేవ శంభో
మా లింగ మూర్తి
మా లింగ మూర్తి
ఏమి సేతురా లింగా, ఏమి సేతురా...
ఏమి సేతురా లింగా, ఏమి సేతురా...
ఏమి సేతురా లింగా, ఏమి సేతురా...